కదిరి, (జనస్వరం) : శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం నిత్యం వందల సంఖ్యలో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు వాహనాల్లో వస్తుంటారు. వారికి సరైన పార్కింగ్ సదుపాయం కల్పించకుండా వాహనదారుల దగ్గర నుంచి పార్కింగ్ డబ్బులు వసూలు చేసుకుంటూ స్థానికంగా నివసిస్తున్న ఇండ్ల దగ్గర వాహనాలు నిలపడం వల్ల స్థానికులు దర్శనం కోసం వచ్చే భక్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. టెండర్ పాడుకొన్న ప్రైవేటు వ్యక్తులు వాహనాలు కేటాయించిన నిర్దిష్ట ప్రాంతంలో కాకుండా మునిసిపాలిటీ ప్రాంతంలో నిలిపిన వాహనాలకు సైతం పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్నారు. స్థానికులు ప్రశ్నిస్తుంటే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడి రాకపోకలకు ఆటంకం కలుగుతుందని శ్రీవారి దర్శనార్థం వాహనాల్లో వచ్చే భక్తులకు సరైన పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి వీధుల్లో ఇండ్ల ముందు వాహనాలు నిలపకుండా తగు చర్యలు తీసుకోవాలని కదిరి నియోజకవర్గం జన సేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్ ఆలయ E.O కి జనసేన పార్టీ తర్పున ఒక వినతి పత్రాన్ని అందించారు. అంతే కాకుండా స్వామి వారి వెనుక వైపు ఉన్న ద్వారం గురించి, కోనేరు అభివృద్ది పనుల గురించి, గోశాల ఏర్పాటు గురించి శ్రీవారికి ప్రతి సంవత్సరం చింతపూల తిరునాళ్ళ ఉట్టి దగ్గర ఉన్న కుంతీ తీర్థం అభివృద్ది పనుల గురించి,ముత్యాల చెరువు దగ్గర ఉన్న పాల భావికి కంచే ఏర్పాటు చేసి రక్షణ కల్పించండి అని E.Oకి తెలిపారు. ఈ కార్యక్రమంలో కదిరి పట్టణ అధ్యక్షులు కాయల చలపతి, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, ఐటీ వింగ్ కోఆర్డినేటర్ పొరకల రాజేంద్ర ప్రసాద్, మండల నాయకులు భూక్య రవీంద్ర నాయక్, కిన్నెర మహేష్, అంజిబాబు, మోహన్, గణేష్, కమ్మగిరి దివాకర్ పాల్గొన్నారు.