
అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురుబ హనుమంత్ ఇటీవల దొడ్బల్లాపూర్ నుంచి బైక్ లో వస్తుండగా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కు గురై గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. తాను క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడంతో ప్రమాదపు బీమా క్రింద 18 వేల రూపాయల చెక్కును జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు హనుమంత్ కి అనంతపురం జిల్లా జనసేనపార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి చేతులు మీదగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాలు ప్రధాన కార్యదర్శి పి.భవాని రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు, ప్రాంతీయ కమిటీ మహిళా సభ్యులు, జనసేన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.