విశాఖపట్నం ( జనస్వరం ) : రుషికొండ ప్రాంతాన్ని త్వరలో విశాఖ రాబోతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సందర్శిస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కోన తాతారావు పేర్కొన్నారు. ఆదివారం రుషికొండ వద్ద జరిగిన నిర్బంధ ఘటనపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారని… నిరసన కొనసాగించాలని ఆదేశించారని తెలిపారు. ప్రజల పక్షాన నిలిచి…. అన్యాయాన్ని ప్రల్నిస్తే కేసులు పెడతారా? కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులను నిర్భందిస్తారా ? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఆయన అని ధ్వజమెత్తారు. సోమవారం విలేకరుల సమావేశంలోనూ, మీడియా ప్రతినిధులతోనూ ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన నిలిచి న్యాయం గురించి పోరాడుతున్న కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ పైనా, హైకోర్టు న్యాయవాది కె.ఎస్.మూర్తిపైనా అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామని, వెంటనే కేసు ఉపసంహరించుకోవాలన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన నిర్మాణాలు ప్రభుత్వ ఆస్తులని, వాటిని చూస్తే తప్పేమిటని ప్రశ్నించారు. 19968చదరపు మీటర్లకు అనుమతులు తీసుకుని 70 ఎకరాల్లో నిర్మాణాలకు వీలుగా రుషికొండను తవ్వుతున్నారన్నారని ఆరోపించారు. వ్యర్థాలు తీరం వెంబడి వేసుకునేలా కలెక్టర్ అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. మూర్తియాదవ్ చేసే పోరాటానికి జనసేన నాయకులు, శ్రేణులు మద్దతుగా నిలుస్తామన్నారు. జీవీఎంసీకి సుమారు రూ.18 కోట్లు కట్టాలని ఆన్‌లైన్‌లో చూపిస్తుండగా…. జీవీఎంసీ అధికారులు కేవలం రూ.10వేలు మాత్రమే కట్టించుకున్నారని, పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించకున్నా పనులు చేస్తున్నారని ఆరోపించారు. అనుమతించిన ష్లాన్ ప్రతిని నిర్మాణ స్థలం దగ్గర ప్రదర్శించాలన్న నిబంధనను కూడా నిర్మాణ సంస్థ పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ సుమారు 9.8 ఎకరాల్లో నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉండగా… కొండచుట్టూ రేకులతో ఫెన్సింగ్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. విధ్వంసంతో ప్రస్తుత ప్రభుత్వపాలన మొదలైందని… నేటికీ అదే విధంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. దీనికి ముగింపు పలికే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. చోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి. వి.ఎస్. ఎన్.రాజు మాట్లాడుతూ నేటి ప్రభుత్వపాలన నియంతృత్వాన్ని గుర్తు చేస్తోందన్నారు. భీమిలి ఇన్‌ఛార్జి సందీప్ మాట్లాడుతూ అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతుకలను నొక్కలేరన్నారు. వైజాగ్ ప్రజల ఆస్తి, ఆంధ్ర ప్రజల ఆస్తి. అలాంటి దానిని ప్రవైట్ పరం చేశారు. ఎర్రమట్టి దిబ్బలను ఎలా దోచేశారో, ఋషికొండను కూడా అలాగే మింగేస్తున్నారు. ఎవడబ్బా సొత్తని 80 ఎకరాల మేర ఫెన్సింగ్ వేశారు. అటు పర్యాటక శాఖకు మచ్చ తెచ్చేలా, మత్సకారుల జీవన భృతిని నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.