పార్వతీపురం ( జనస్వరం ) : వీరఘట్టం మండలం మండలం, ములలంక, గాదెలలంక, పెద్దూరు గిరిజన గ్రామాల్లో ఈరోజు జనసేన పార్టీ నాయకులు పర్యటించారు. గిరిజన ప్రాంతాల్లో పల్లె పల్లెకు – గూడు గూడుకు జనసేన పార్టీ మ్యానిఫెస్టో మరియు సిద్దాంతాలు ప్రజలకు అర్ధమైన రీతుల్లో జనసేన నాయకులు మత్సపుండరీకం వివరిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి ఐదు నుండి ఎనిమిది గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తెల్లరేషన్ కార్డుదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం చేసిన రైతులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం జనసేన పార్టీ కల్పిస్తుందన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు. అలాంటి నాయకుడుని ముఖ్యమంత్రి ని చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని ఆయన పిలుపునిచ్చారు. గత నాలుగు వారాలుగా గిరిజన ప్రజల దగ్గరకి వెళ్లి పలు కుటుంబాలను కలిసి జనసేన పార్టీ సిద్ధాతాలు గురించి వివరంగా చెప్పడం జరిగిందన్నారు. గిరిసేన – జనసేన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు.