ఎమ్మిగనూరు ( జనస్వరం ) : గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా పల్లెల్లో ప్రగతి పడకేసిందని ప్రధాన వీధుల్లో రోడ్లు, డ్రైనేజి అస్తవ్యస్తంగా తయారై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మిగనూరు జనసేన నాయకులు అన్నారు. ఎన్నికల సమయంలో పాలకులు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నాయకులు గానిగ బాషా, ఖాసీం సాహెబ్, మాలిక్, ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గోనెగండ్ల లోని చాకలి వీధి, ఉప్పర వీధి, దనుబండ వీధుల్లో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సి సి రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో మురుగు కాల్వల్లో ప్రవహించే నీరు ప్రధాన రహదారుల మీదకు వచ్చి నిల్వ ఉండటంతో దుర్వాసన, దోమల బెడద కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని మలేరియా డెంగ్యూ, లాంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం వుందన్నారు. పల్లెల్లో అభివృద్ధి జాడనే లేదని త్రాగునీటి కష్టాలు డ్రైనేజి సమస్యలు నిత్యం ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యలని హామీలు ఇచ్చి విస్మరించిన నాయకులకు వచ్చే ఎన్నికల్లో ఇంటింటికి ఓటుకోసం వస్తే ప్రజలు గట్టిగానే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై పాలకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, మాబాష, రవి కుమార్,ఉపేంద్ర, మధు, శంకర్, అలీ బాషా,సుబాన్, మునాఫ్,సాధిక్,వెంకటేష్, రంగముని, వీరేష్, రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు.