ప్రకాశం, (జనస్వరం) : ప్రస్తుత రాష్ట్ర సీఎం జగన్ రెడ్డి, నాడు ప్రతిపక్ష నేతగా ఉంటూ.. పాదయాత్ర చేసి మరీ మద్యపాన నిషేదం చేస్తానని చెప్పి గద్దెన ఎక్కిన తరువాత ఆడపడుచులను దగా చేసిన ఏకైక సీఎం జగన్ రెడ్డి వైఖరికి నిరసనగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు సోమవారం ప్రకాశం జిల్లా జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ మద్యం నిషేదం పేరు చెప్పి ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి ఈ రోజు అదే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దశల వారీగా మద్యం నిషేధం అంటూ ప్రతి ఎన్నికల సభలోనూ ఆడపడుచులకు మాయ మాటలు చెప్పిన సీఎం దశల వారీగా మద్యం ఆదాయం పెంచుకునే కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. దీనిలో భాగంగా తాజాగా 840 బార్లకు రాష్ట్రంలో లైసెన్సులు ఇచ్చేందుకు తాజాగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే నగరాలు, పట్టణాల్లో ఇప్పుడున్న బార్ల సంఖ్య దాదాపు రెట్టింపు చేసి తద్వారా మరింత ఆదాయాన్ని పెంచుకునే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని అనామయ కంపెనీల పేరుతో వ్యాపారం చేస్తోంది. తన వారి పేరు మీద డిస్టలరీలకు మద్యం ఆర్డర్లు పెట్టి పేదోడి రక్తాన్ని పెద్దలకు దాసోహం చేస్తోంది. మద్యంలో అత్యంత ప్రమాదకర విష పదార్థాలు ఉన్నాయని, అవి ప్రాణానికి కూడా ప్రమాదమని ఒక పక్క నిపుణులు, వైద్య మేధావులు చెబుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తను అనుకున్న వారీ డిస్టలరీలకు ఏడాదికి రూ. 1500 కోట్ల నుంచి రూ.2500 కోట్ల మద్యం ఆదాయాం తెచ్చి పెట్టే ఆర్డర్లు ఇస్తోంది. విష పదార్థాలను నిండిన మద్యం తాగి గత అయిదేళ్ళలో 5000 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆడపడుచులకు అన్నగా ఉంటానని నమ్మించి…. ఓట్లు దండుకున్న ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు వారిని అనాధలను చేస్తున్నారని అన్నారు. మద్య నిషేదం చేస్తాను అన్న హామిని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని లేని పక్షంలో జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
– ఎక్సైస్ శాఖను ఓ వ్యూహం ప్రకారమే
పూర్తిగా కుంటిదాన్నిచేశారు
– దర్శి ఇంచార్జ్ బోటుకు రమేష్ బాబు
అనంతరం ఈ సందర్భంగా దర్శి ఇన్‌చార్జ్ బొటుకు రమేష్ బాబు మాట్లాడుతూ ఎక్సైస్ శాఖను ఓ వ్యూహం ప్రకారం పూర్తిగా కుంటిదాన్ని చేసి… స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అంటూ పక్కన పడేశారు. తాజాగా గత మూడేళ్ళలో సుమారు రూ.25 వేలకోట్లు మద్యం ఆదాయం అర్జించిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండేళ్ళలో మరో రూ. 30 వలే కోట్లను సంపాదించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా మళ్ళీ మద్యం అమ్మకాల్లో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మద్యం ఆదాయాం చూపి బాండ్లను అమ్మిరూ.8 వేల కోట్లు తెచ్చుకున్న ప్రభుత్వం… ఇప్పట్లో మద్య నిషేధం మాటే లేదని చెప్పకనే చెప్పింది. ఇంకా ఎందరి జీవితాలను మద్యం మహమ్మారికి ఈ ముఖ్యమంత్రి అప్పగిస్తాడో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది అని అన్నారు.
– సామాన్య కుటుంబాలు చిన్నాభిన్నం
– కందుకూరు ఇన్ చార్జ్ పులి మల్లిఖార్జున
తదుపరి కందుకూరు ఇన్ చార్జ్ పులి మల్లిఖార్జున మాట్లాడుతూ రాష్ట్రానికి వివిధ కంపెనీలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించాల్సిన ముఖ్యమంత్రి అవి పరిశ్రమలు తేకుండా వివిధ బ్రాండ్లు మాత్రము తెచ్చి సామాన్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాడు. మద్యం ఆదాయం ద్వారా వచ్చిన డబ్బును తన ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుంటూ ప్రజల ఆరోగ్యం ఏమైపోతుందో అని ఆలోచించకుండా ఉండే ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి. ఇప్పటికైనా మద్య నిషేదం చేస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్నితీవ్రతరం చేస్తామని తెలియజేశారు.
– ధనార్జనే ధ్యేయంగా కత్తీ మద్యం అమ్ముకునే
ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి
– ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి
క్రిష్ణా, పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి మాట్లాడుతూ పాదయాత్రలో మద్య నిషేదం చేస్తానని చెప్పిన హామిని మరచి ధనార్జనే ధ్యేయంగా కత్తీ మద్యం అమ్ముకునే ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి అని మరియు ఆడపడుచులకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి ఉండటం మన దౌర్భాగ్యం అని, ఇప్పటికైనా మద్య నిషేదం చేస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని లేని పక్షంలో మా వీర మహిళలందరూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని తెలియజేశారు.
– అన్నొస్తే మంచిరోజులు వస్తాయన్నారు
– కాని మంచి బ్రాండ్లతో కూడిన మూత్రం తెచ్చారు
ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీళ మాట్లాడుతూ అన్నొస్తే మంచిరోజులు వస్తాయని చెప్పిన ఈ ముఖ్యమంత్రి మంచి రోజులు అయితే రాలేదు కాని మంచి బ్రాండ్లు మాత్రము వచ్చాయని దేశంలో కనివిని ఎరుగని బ్రాండ్లు ఉన్న ఏకైక రాష్ట్రం మనది అని ఆ ఘనత సాధించిన ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి అని అన్నారు. యువతకు ఉపాధి కల్పించలేని ఈ ముఖ్యమంత్రి, ఆడపడుచులకు రక్షణ కల్పించలేని ఈ ముఖ్యమంత్రి, రైతన్నకు భరోసా ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రిని రానున్న ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు మాత్రము మీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి మీకు విశ్రాంతి మాత్రము ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్. ఒంగోలు నగర అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల,రాయని రమేష్, శివరాం ప్రసాద్ గారు, రహిముల్లా, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు దొరసాని నాయుడు, కొత్తపట్న మండల అధ్యక్షులు నున్నా జానకి రామ్,ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శులు కందుకూరి వాసు,దండే అనీల్, ఆర్.కె నాయుడు ముత్యాలు,ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు హనుమంతరావు, గోవింద్ కోమలి, వెంప నరేంద్ర, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉషా,తన్నీరు ఉష, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి శైలజ, 21 వ డివిజన్ అధ్యక్షులు వాసుకి నాయుడు, 3వ డివిజన్ అధ్యక్షులు ముంతాజ్, 25 వ డివిజన్ అధ్యక్షులు పోకల నరేంద్ర మరియు 1వ డివిజన్ అధ్యక్షులు విప్పర్ల హర్ష, 19వ డివిజన్ అధ్యక్షులు ఇమ్మడిశెట్టి శ్రీను,49వ డివిజన్ అధ్యక్షులు మాల్యాద్రి నాయుడు,41,42 వ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ పవన్, చల్లా క్రిష్ణ, దర్శి మండల కమిటీ అధ్యక్షురాలు భూలక్ష్మీ,జనసేన వీర మహిళలు కోసూరి శిరీష, కళ్యాణి, శ్రీమతి కాల్వా లక్ష్మీ,సముద్రాల జగదీశ్వరి,అన్నపూర్ణ,అరుణ,మహాలక్ష్మీ,అంజమ్మ,వాణి,మాధవి,మరియు మండల అధ్యక్షులు ఒంగోలు నగర కమిటీ సభ్యులు,డివిజన్ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.