కదిరి ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యలపై చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై నల్లచెరువు మండలం బాలేపల్లి తాండా నుంచి 20 మంది యువకులు ఇంచార్జ్ భైరవప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. భైరవప్రసాద్ మాట్లాడుతూఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేస్తూ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యగలిగిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని భావించి మార్పు దిశగా అడుగులు వేస్తూ జనసేన పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. మొద్దు నిద్ర పోతున్న ఈ ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు గాలికి వదిలి విచ్చలవిడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చిన హామీలు గుప్పిస్తూ అధికారంలోకి రాగానే మెలికలు పెడుతూ నాటకాలు ఆడుతున్నాడు. వారం రోజుల్లో CPS రద్దు చేస్తాం అని ఉద్యోగులను, ప్రతి సంవత్సరం DSC, లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను, బడికి పంపితే ప్రతి ఒక్కరికీ అమ్మవడి అని, మద్యపాన నిషేదం, ఇంటింటికీ రేషన్ అని,ప్రత్యేక హోదా పేరుతో మేధావులను, పెళ్లి కానుకగా లక్ష రూపాయలు ముస్లింలకు ఇస్తానని,15000₹ రూపాయలు రైతు భరోసాగా ఆసరా కల్పిస్తానని ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చారు. జగన్ రెడ్డి మీద రాష్ట్ర ప్రజల్లో అసహనం మొదలైంది. రాబోయే ఎన్నికల్లో ఈ తుగ్లక్ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గర పడ్డాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, గాండ్లపెంట మండల నాయకులు భూక్యా రవీందర్ నాయక్, లాయర్ రవి గారు పాల్గొనడం జరిగింది.