అనంతపురం, (జనస్వరం) : అనంతపురం అర్బన్ జనసేనపార్టీ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, నగర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు, బాధితులు కలిసి ఎమ్మార్వోకి బాధితుల పక్షాన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం రూరల్ మండలం రాజీవ్ కాలనీ పంచాయతీలో సర్వే నంబర్ 53/2B, 532/C, 53/2D1, 53/2D2, భూమిలో ఐదుగురు సభ్యులు 2.50 సెంట్ల ప్రకారం 2008 సంవత్సరంలో వేసిన లేఔట్ ప్రకారం వారు ఇంటి స్థలాలు కొన్నారు. ఈ స్థలమునకు చెక్ బందిలో తూర్పు దిశన 40 అడుగుల రోడ్డు కలదు. ప్రస్తుతం ఈ స్థలంలో బాధితులు ఇల్లు కూడా నిర్మించుకుని కాపురం ఉంటున్నారు. అయితే వీరి ఇంటి స్థలమునకు తూర్పు భాగాన 40 అడుగుల రోడ్డును కొంతమంది అక్రమదారులు అక్కడ ఉన్న చెట్లను నరికి వేసి అనంతపురం నడిమి వంక (మురికినీటి కాలువను) పూడ్చి 40 అడుగుల రోడ్డును పూర్తిగా ఆక్రమించుకుని ప్లాట్లు వేసి బండలు నాటి కంచెను ఏర్పాటు చేశారు. దానిని గమనించి అక్కడ ఉన్న ప్లాట్ల యజమానులు అక్రమంగా 40 అడుగుల రోడ్డు మరియు వంక భూమిని ఎందుకు ఆక్రమిస్తున్నారు అని ప్రశ్నించగా వారిని భూ కబ్జాదారులు దౌర్జన్యంతో దుర్భాషలాడుతూ, కొట్టడానికి వస్తూ బెదిరించగా గతంలో ఉన్న ఎమ్మార్వోకి, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సంవత్సరం రోజులుగా న్యాయపోరాటం చేశారు, కానీ ఎవరు సరిగా స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టువారు బాధితుల డాక్యుమెంట్లు అన్నియు పరిశీలించి 40 అడుగుల రోడ్డుకు సంబంధించి శాశ్వత ఇన్ జంక్షన్ ఆర్డర్ మంజూరు చేశారు. కావున దయచేసి ఇప్పటికైనా వీటిని పరిశీలించి అక్రమార్కుల నుండి అన్యాక్రాంతమైన వంక భూమిని (మురికి నీటి కాలువ), 40 అడుగుల రోడ్డును పరిరక్షించాల్సినదిగా జనసేన పార్టీ తరఫున కోరారు. లేని పక్షాన బాధితుల పక్షాన జనసేన పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు సదానందం, గ్రంధి దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శులు రోళ్ల భాస్కర్, కమటం వెంకటనారాయణ, కార్యదర్శులు విశ్వనాథ్, రాజేష్ కన్నా, సంపత్, లాల్ స్వామి, సంయుక్త కార్యదర్శిలు ఆకుల అశోక్, నెట్టిగంటి హరీష్, ఆకుల ప్రసాద్, రమణ, మంగళ కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళి, జిల్లా కార్యదర్శలు రాప ధనుంజయ్, కిరణ్ కుమార్, వాసగిరి మణికంఠ, సిద్దు సంయుక్త కార్యదర్శి విజయకుమార్, నాయకులు ముప్పూరి కృష్ణ, చిరు, నజీమ్, వెంకటేశులు తదితరులు పాల్గొనడం జరిగింది.