ఇబ్రహీంపట్నం మండలంలో జనసేన రచ్చబండ కార్యక్రమం

రచ్చబండ

     కృష్ణా ( జనస్వరం ) : ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని జూపూడి, మూలపాడు, కేతనకొండ, కోటికలపూడి గ్రామాలలో ఇబ్రహీంపట్నం జనసేన పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలను, విధి విధానాలను, పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలను మండలంలోని ప్రతీ గ్రామానికి, ప్రతీ ఇంటింటికి తీసుకెళ్లాలని పార్టీ ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కార్యకర్తలతో జనసేన రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రజలను వారియొక్క గ్రామ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మండలంలోని ప్రతి ప్రధాన సమస్యలపై జనసేనపార్టీ తరుపున ప్రశ్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం ఇంచార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిది అక్కల రామ మోహన రావు (గాంధీ) మాట్లాడుతూ జనసేన పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ అని ప్రతి సామాన్యుడుకి మేలు జరగాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి లక్ష్మి కుమారి, కొమ్మరి హనుమంతరావు, వెంకటస్వామి, అశోక్, హరికిషోర్, నరేంద్ర, దుర్గారావు, కట్టాశ్రీను, పురం సురేష్ మరియు జనసేనపార్టీ ఇబ్రహీంపట్నం మండల కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  జనసేన సభతో వైసీపీ పార్టీకి మతి భ్రమించింది : లాయర్ జయరాం రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి