మాడుగుల ( జనస్వరం ) : చీడికాడ మండలం, అర్జునగిరి గ్రామంలో జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ పర్యటించి అక్కడ సమస్యలు ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య కారణంగా గ్రామ ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని ఆయన దృష్టికి స్థానిక జనసేన నాయకులు తీసుకొచ్చారు. గ్రౌండ్ లెవెల్ లో ఉన్న వాటర్ తాగడం వల్లనే అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరఫున గ్రామంలో ఉన్న ఐదు మంచినీటి బోర్ల వాటర్ శాంపిల్స్ ల్యాబ్ కి టెస్టుకు పంపగా, ఆ గ్రామంలో ఉన్న వాటర్ లో పీహెచ్సీ కాల్షియం ఇతర కలిసి ఉన్నాయని ఆ వాటర్ తాగడానికి పనికిరాదని ల్యాబ్ రిపోర్ట్ లో ఇచ్చారని రాయపరెడ్డి కృష్ణ అన్నారు. గతంలో గ్రామ ప్రజలు ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి విన్నవించుకోగా మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలని ఆయన చెప్పడం బాధాకరమని గ్రామ ప్రజలు తమ గోడుని విన్నవించారన్నారు. గ్రామ సచివాలయంలో ఉన్న అక్కడ ప్రస్తుత MLHP స్వామి వివరించగా వారం పది రోజుల్లోగా పై అధికారులతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం అందిస్తామని చెప్పడం జరిగింది. మెడికల్ క్యాంపు కూడా ప్రభుత్వం వారితో మాట్లాడి ఏర్పాటు చేయమని అడగడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేయని పక్షాన జనసేన పార్టీ తరఫున మెడికల్ క్యాంపు కూడా పెడతామని ఆ గ్రామ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సాయి, పెంటకోట కిరణ్, సూరిబాబు రామ్ లక్ష్మణ్ మూర్తి, హేమంత్ మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.