
అనంతపురం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రాజకీయ౦గా ఎదుర్కోలేక వైసిపి నేతలు ఆరోపణలు చేయడం హేయమైన చర్య. ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలపై గళం విప్పుతున్న జనసేన పార్టీని జోకర్ పార్టీ అని విమర్శించిన మంత్రి దాశెట్టి రాజా, ప్రభుత్వ విప్ ఉదయభాను నోరు అదుపులో పెట్టుకోవాలని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జనసేన శ్రేణులు రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడ్డుతుంటే. రాజకీయ లబ్దికోసం పాకులాడుతున్న వైసీపీ నేతలు జనసేనను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న మీకు ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచుతామని చెప్పిన ప్రత్యేక హోదా తీసుకురావాలని… అలాకాకుండా ప్రజా బలం కూడగట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే మీకు తగిన గుణపాఠం చెబుతామని జయరామిరెడ్డి హెచ్చరించారు.