విజయనగరం జిల్లాలో జగనన్నఇళ్ళు నిర్మాణ దశలోనే కూలిపోతున్న గృహాలు

విజయనగరం

    విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్ గారి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి గారికి “జగనన్న ఇల్లు” గురించి వివరించారు. ముచ్చర్ల గ్రామం నిర్మాణంలో నాణ్యత లోపం కారణంగా నిర్మాణ దశలోనే కూలిపోతున్న గృహాలు ఉన్నాయని జనసేన నాయకులు అన్నారు. నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు, లబ్ధిదారులు అధికార పార్టీ నాయకులకు భయపడి ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్ గారికి జనసేన నాయకులు  వినత పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై జనసేన పార్టీ తగు న్యాయం చేయాలని లబ్ధిదారులకు కట్టిన ఇల్లు కూలగొట్టి నాణ్యమైన ఇల్లుని పునర్నిర్మించాలని కోరడం జరిగింది. ఈ విషయంపై కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఆదాడ మోహన్ రావు, టి.రామకృష్ణ (బాలు) మిడతాన రవికుమార్, మురళి మోహన్, సాయి, రాజు, సురేష్ పాల్గొన్నారు.

See also  సిరివెళ్ల గ్రామ సమస్యలు పరిష్కరించండి: ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన నాయకులు డిమాండ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి