మదనపల్లి ( జనస్వరం ) : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెరువులను చదును చేసి కబ్జారాయులు ఆక్రమిస్తున్నారని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు. ఆమె మాట్లాడుతూ భూముల ధరలు పెరిగిపోవడంతో నగర పట్టణ సమీపంలోని చెరువులో గుంటలు రహదారుల పక్కన ఉన్న నీటి వనరులు ఆక్రమణకు గురవుతున్నాయన్నారు. ముఖ్యంగా నగర పురపాలక సంఘాల్లోని తటాకాల జాడ కనిపించకుండా పోతుంది. ఇటీవల జరిగిన టిఆర్ సి సమావేశంలో చెరువుల ఆక్రమణపై చర్చ జరిగింది. వెంటనే ఆక్రమణలు గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైయస్సార్ జిల్లాలో 593 చెరువులు ఉండగా దీని కింద 56,282 ఎకరాల ఆయకట్టు ఉంది అన్నమయ్య జిల్లాలో 3328 చెరువుల కింద 1,27,398 ఎకరాల ఆయకట్టు ఉంది. డిఆర్సిలో తీసుకున్న నిర్ణయం మేరకు జల వనరుల శాఖ అధికారులు తొలి విడతలు 124 చెరువులు అక్రమనకు గురైనట్లు గుర్తించారు. ఇలా గుర్తించిన చెరువులను పరిశీలించి చెరువు చుట్టూ ఉపాధి హామీ పథకం నిధులతో ట్రెంజ్లు తగ్గాలని నిర్ణయించినప్పటికీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తొలి విడతలో యుద్ధ ప్రాతిపదికన అక్రమన చెరువులను గుర్తించాం. వాటి వివరాలను డ్రామాకు పంపించామన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో వాటి చుట్టూ ట్రేంచులు వేస్తాం అనే నీటిపారుదల శాఖ ఎస్సీ చెప్పిన ఈ విషయం డ్రామా పిడి వరకు ఆక్రమణకు గురైన చెరువుల జాబితా అందలేదన్నారు. జిల్లాల వారీగా ఆక్రమణకు గురైన చెరువులు పీలేరు మండలం తలపుల పంచాయతీ కొండూరు వాండ్ల పల్లిలో కొత్త కుంటలో 300 ఎకరాల వరకు వరి సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకుపైగా కబ్జాకు గురైంది. గాలివీడులోని పెద్ద చెరువు మొత్తం 87 ఎకరాల్లో ఉంటే పది ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైంది. ఈ విధంగా ప్రతి జిల్లాలోనూ రైతులకు ప్రజలకు సాగునీరు తాగునీరుకి జీవనాధారణమైన చెరువులు ఈ విధంగా అక్రమనలకు గురవుతున్న ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరం. ఇప్పటికైనా వర్షాకాలం లో చెరువులు కు నీరు చేరే సమయం కాబట్టి అక్రములకు గురైన చెరువులకు సంబంధించిన స్థలాలను తొలగించి చెరువులకు కలపాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.