పిఠాపురం ( జనస్వరం ) : గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనసేన పార్టీ ముంపు ప్రాంతాలలో పర్యటనలో భాగంగ స్ధానిక జీవనగరం 25వ వార్డులో పర్యాటించిన జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి మాకీనీడి శేషుకుమారి. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ప్రభుత్వాలు మారతాయి, ప్రజా ప్రతినిధులు మారతారు కాని మా పరిసరాలు, మా పరిస్థితి మారడం లేదని, వర్షం కురిస్తే మా ప్రాంతంమంతా పది సంవత్సరాలుగా మురికి మయం అవుతుందని పిఠాపురం టౌన్ 25వ వార్డు జీవనగరం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ తక్షణమే చర్యలు చేపట్టకపోతే మున్సిపల్ ఆపీసు ఎదురుగా బైటాయిస్తానని హెచ్చరించారు. ఈసమస్యలను అధికారులు, స్థానిక శాషనసభ్య సభ్యులు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యేవరకు మీ పక్షాన పోరాడతాని హామిఇచ్చారు. ఎన్నికల్లో నేను ఉన్నానని, నేను ఉంటాను, నేను విన్నాను అని మాయ మాటలుపలికి ఓట్లు దండుకుని ప్రజలను మురికి నీటిలో వదలి వెళ్ళడం, ప్రజలు మా పరిసరాలు కొంపు కొడుతున్నాయని గగ్గోలు పెడుతుంటే ఏమి విన్నారని ఏళ్ళ సమస్యలు ఇప్పటి వరకు సరి చేలెకపోవడం మాటతప్పడం కాదా ? అని ప్రశ్నించారు. చిన్న సమస్య డ్రైనేజీ తియ్యడానికి వీలు కాకపోతే ట్యాంకర్ ద్వారా బయటికి పంపించాలని అధికారులను నిలదీయకపో పోవడం మడం తిప్పడం కాదా మీకు చేతకాక పోతే పక్క మున్సిపాలిటీని సలహా తీసుకుని పని చేయండని ఘాటుగా విమర్శలు గుప్పారు. గత శాసనసభ్యులు ఎస్ వి.యస్.న్ వర్మ కోట్లు నిధులు తెచ్చాను పట్టణ డైలెప్ మెంటుకి అని గొప్ప ప్రసంగాలు చేసారు. కానీ మార్పు అభివృద్ధి ఏది అని ఆమె అన్నారు. అధికారులు ఆఫీస్ కే పరిమితం కాకుండా వార్డులో పర్యటించి తక్షణమే మురికి నీరు బయటి పంపించే ఏర్పాట్లు చేయాలని వర్షాల కాలంలో సీజనల్ వ్యాధులు వస్తాయని తెలిసికూడా అధికారు ఇలా నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుపట్టారు. కరోనా లాంటి వైరస్ లు మలేరియా, డెంగీ ఊరికినే రావని, ఇలాంటి తప్పిదాలు వలనే వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి, పబ్బిరెడ్డి దుర్గాప్రసాద్, కసిరెడ్డి నాగేశ్వరరావు, తోట సతీష్, నామ శ్రీకాంత్, నామ సాయి గోపు సురేష్, యండ్రపు శ్రీనివాస్, గొల్లపల్లి గంగ, కందా సోమరాజు, వినుకొండ అమ్మాజీ, వినుకొండ శిరీష, వార్డు ప్రజలు జనసైనికులు నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.