పిఠాపురం, (జనస్వరం) : పిఠాపురం పట్టణంలో మూడు రోజులుగా మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చేబట్టారు. అందులో భాగంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఏఐటీయూసీ నాయకులు సాకా రామకృష్ణ అధ్యక్షన చేబట్టిన 3వ రోజు సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి సంఘీభావం తెయజేశారు. ఈ సందర్భంగా కార్మికులతో మమేకమై వర్షం అనిచూడకుండా సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులను చూసి చలించిపోయారు. న్యాయమైన డిమాండ్ లను ఖచ్చితంగా తీర్చవలసి ఉందని మీడియాతో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే పరిసారులు శుభ్రంగా ఉండవని కరోనాలాంటి భయంకరమైన వైరస్ ఈరోజుల్లో కొలువుతీరుతూన్నాయని, ఇలాంటి పరిస్థిలో పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించకపోతే పారిశుద్ధ్యం పడకేస్తుందని వారు అడుగుతున్న డిమాండ్లు న్యాయబద్దంగా ఉన్నాయని సమానంగా పనిచేయించుకొనె ప్రభుత్వం సమానవేతం ఇవ్వాలని పాదయాత్రలో పలికి పర్మింట్ హామీ నెరవేర్చాలని పెండింగ్ లోఉన్న హెల్త్ అలెవెన్స్ తక్షణమే ఇవ్వాలన్నారు. సీపీఎస్ రద్దు చేస్తానని ముక్తి కంఠంతో అన్న మాట నిలబెట్టుకోవలన్నారు. ఆప్కో స్ లో రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు వారి పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. కార్మికులు కోరే డిమాండ్లు మాట తప్పకుండా మడం తిప్పకుండా నెరవేర్చాలని నేను విన్నాను నేను ఉన్నాను బరోసా జగన్మోహన్ రెడ్డి కార్మికులకు న్యాయం చేసి నిరోపించుకోవాలని సవాల్ విసిరారు. అలాగే ఈ కార్మికులకు భీమవరంలో జరగబోయే17వ తారీఖున మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమంలో అర్జీలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఈ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పుణ్య మంతుల సూర్యనారాయణమూర్తి, మాజీ కౌన్సిలర్ వేణు నారాయణరావు, గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరాది వల్లి రామకృష్ణ, గోపు సురేష్, గంగిరెడ్ల సూరిబాబు, యండ్రపు శ్రీనివాసు, మాదేపల్లి పద్మరాజు, కంద సోమరాజు, పబ్బినీడి దుర్గాప్రసాద్, నామ శ్రీకాంత్, కొనమచిలి దుర్గాప్రసాద్, రాజు, స్వామి, రాజేష్, అప్పన్న, కార్మికులు, నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.