విశాఖపట్నం ( జనస్వరం ) : GVMC పారిశుధ్య కార్మికులకు కనీస వసతులు, వనరులు, కనీసం చీపుర్లు కూడా కల్పించకుండా వాటి కోసం మంజూరు చేసిన ధనాన్ని దారి మల్లిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలో జనసేన 33వ వార్డు కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ GK వసంత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకి కనబడకుండా తిరుగుతున్నాడన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లు కనబడుతున్నాయి. చెత్త బుట్టలో వెయ్యాలి ఈ చేత గాని పాలన చేస్తున్న ఈ చెత్త ప్రభుత్వాన్ని. అర్హత గల మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి. పనిముట్లు కూడా సరఫరా చేయకుండా పని చేయమంటే ఎలా? కార్మికులు తమ సొంత డబ్బుతో పనికి పరికరాలు కొనుక్కోవడం దారుణమని అన్నారు. సంక్షేమ పథకాలేవీ వారికి అందటం లేదు. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు ఏవి మున్సిపల్ కార్మికులకు అందవు. దశాబ్దాలుగా పనిచేసి 60 ఏళ్లకే రిటైర్ మెంట్ అయితే ఒక్క బెనిఫిట్ కూడా వారికి వర్తించటం లేదు. ఇస్తున్న హెల్త్ అలవెన్సు ఆరు వేల రూపాయలు కూడా ఆపేశారు దానిని పునరుద్ధరించాలి. టైం స్కేల్ అనేది లేకుండా వారి చేత పనులు చేయిస్తున్నారు. నెలలో 30 రోజులు పని చేస్తే ఇరవై నాలుగు రోజులకే లెక్కగట్టి జీతం ఇవ్వటం అమానుషమన్నారు. ఈ సమ్మెలో జనసేన నాయకులు ఆకుల సంతోషి, నీలం రాజు, GK గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.