కర్నూలు ( జనస్వరం ) : గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మండల కేంద్రమైన గోనెగండ్లలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు గానిగ బాషా, ఖాసీం సాహెబ్ ఆధ్వర్యంలో గోనెగండ్లలో సమస్యలు నెలకొన్న పలు విధుల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్నా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా త్రాగునీటి, డ్రైనేజి, సమస్యలు అధికంగా ఉన్నాయని, ఎన్నికల్లో ఎన్నో హామీలు గుప్పించి హడావిడి చేసిన నాయకులు గెలిచిన తరువాత తమ కార్యాలయాలకే పరిమితం కావడం సిగ్గుచేటన్నారు, ప్రజలకు న్యాయం చేయలేని పదవులు ఎందుకని వారి పదవులకు రాజీనామాచేసి ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు, డ్రైనేజీల ద్వారా మురుగునీరు కొన్ని చోట్ల ఇంటి పరిసరాల్లో, ప్రధాన రహదారులకు అడ్డంగా విధుల్లో నిల్వ ఉండటమే కాకుండా ఏకంగా ఇళ్లలోకి మురుగునీరు ప్రవహించే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అనారోగ్యాల భారిన పడితే సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించే 30 పడకల వైద్యశాలలో రోగులకు డాక్టర్లు అందుబాటులో ఉండరని ఇప్పటికైనా గ్రామలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, మాలిక్, షఫీ, మాబాష, నబి రసూల్, రవికుమార్,అలిబాష, హీనయత్, రంగస్వామి, దూద్ పిరా,మధు, ఉపేంద్ర, మునిస్వామి, ఇస్మాయిల్,మునాఫ్, పాల్గొన్నారు.