కార్వేటి నగరం ( జనస్వరం ) : మండల కేంద్రంలో జనసేన పార్టీ మండల కమీటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జి Dr యుగంధర్ పొన్న మాట్లాడుతూ ఉన్నతమైన వ్యక్తులు తోనే వ్యవస్థలో ఉన్నతమైన మార్పులు వస్తాయి. ఆ ఉన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్, ఆ ఉన్నత మైన వ్యవస్థ జనసన పార్టీ అని ఉద్భోదించారు. మన పరివారం ఎంత పెద్దదైతే అంత గొప్ప విజయాలు మన సొంతం అవుతాయని తెలియజేసారు. గుండె ధైర్యం అంటే జిమ్ కి వెళ్తే వచ్చేది కాదు, సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి ఆ సమస్య పరిష్కరిస్తే వచ్చేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఓట్లు నోట్లు అధికార వ్యామోహంతో రాజకీయాల్లోకి రాలేదు, యువశక్తిని రాజకీయశక్తిగా మార్చడానికి వచ్చారని తెలియజేసారు. సమాజంలో మార్పు రావాలంటే తుపాకులు, కత్తులు పట్టుకొని యుద్ధం చేయటం కాదు. ప్రతి ఒక్కరు బలంగా నిలబడి అభిప్రాయం చెప్పాలని ఉద్ఘాటించారు. రాజకీయాల్లో మార్పు తీసుకు రావాలంటే బలమైన సంకల్ప బలం ఉండాలని తెలిపారు. రాజకీయాల్లో రాణించాలంటే నాయకులకు కార్యకర్తలకు ఓపిక సహనం చాలా అవసరమని, అవమానాలకు ఎదురొడ్డి నిలబడాలని తెలిపారు. కులం పేరు చెప్పి వ్యక్తులు లాభపడ్డారు తప్ప… కులాలు బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రమేనని తెలిపారు. బుధవారం నుండి బూతు స్థాయిలో జనంకోసం జనసేన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, గౌరవ అధ్యక్షులు భాను చందర్ రెడ్డి, అన్నామలై ఉపాధ్యక్షులు విజయ్,సెల్వి, సురేష్ రెడ్డి, లోకేష్ రాయల్, ప్రధాన కార్యదర్శి లు వెంకటేష్, నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్యదర్శులు గురు మూర్తి, సంయుక్త కార్యదర్శులు భాస్కర్, రూపేష్, రుకేష్, భాస్కర్, యుగంధర్ రెడ్డి జనసైనికులు పాల్గొన్నారు.