అనంతపురం ( జనస్వరం ) : నాడు.. నేడు పేరుతో ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ వేల కోట్లు ప్రకటనల పేరుతో ప్రజా ధనాన్ని దుర్యోగం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చే ఎన్నికల్లో మరల ఎలా గెలవాలని దురాలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటన్నారు. స్కూల్లో విలీనం అశ్శాస్త్రీయంగా చేయడం వల్ల, బడులకు వెళ్లే పిల్లలు నాన ఇబ్బందులు పడుతున్నారు. సరైన వసతులు సదుపాయాలు కల్పించకుండా విలీనం చేయడం వల్ల పిల్లలతోపాటు ఉపాధ్యాయులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో ప్రాథమిక స్కూల్ల లీనం వల్ల చిన్న పిల్లలు మరియు తల్లిదండ్రులు స్కూల్లో దూరం పెరిగి…. సరైన ట్రాన్స్పోర్ట్ వసతులు లేకపోవడం వల్ల గ్రామస్థాయిలో ప్రాథమిక విద్యార్థులు ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల అభిప్రాయాలకు, ఆలోచనలకు వ్యతిరేకంగా ఆశాస్త్రీయమైన నిర్ణయాలు తీసుకుని ప్రజా వ్యతిరేకతకు గురవుతావుంది ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు…. ప్రజల ఆలోచనలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుని ప్రజా ఆగ్రహానికి గురి కావద్దని హెచ్చరిస్తున్నామని అన్నారు.