● హాస్టల్ లో సరైన వసతులు లేవు ?
● అబద్దాలతో పబ్బం గడుపుతున్న జగన్ ప్రభుత్వం
● జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పొతిన వెంకట మహేష్
విజయవాడ, (జనస్వరం) : సాయిరాం సెంటర్ లంబాడి పేట వద్ద గల సాంఘిక సంక్షేమ హాస్టల్ ను జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ సందర్శించారు. హాస్టల్ లో ఉన్న వసతులపై విద్యార్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయాన్నే వంట చేసి టేబుల్ మీద ఉంచిన ఆహారాన్ని మహేష్ రుచి చూడగా కిచిడి చప్పగా ఉందని, తెల్ల అన్నం రేషన్ డిపో లో ఇచ్చే బియ్యం కన్నా చాలా నాశిరకంగా ఉండే బియ్యం తో అన్నం వండరని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాసిరకం అన్నం పెడుతూ జగన్ ప్రభుత్వం బయట అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేసుకుంటుదన్నారు. విద్యార్థులతో కలిసి హాస్టల్ మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ చాలా అధ్వానంగా ఉందని, బాత్రూంలు అందుబాటులో లేవని, కుళాయిలు సరిగ్గా పనిచేయడం లేదని, మురుగుకాలువలో నీరు డ్రైనేజీ లో కలవకపోవడం వల్ల దోమలు తీవ్రంగా ఉంటున్నాయని, హాస్టల్లో లో ఫ్యాన్లు సరిగా పనిచేయడం లేదని, మంచి నీటి కుళాయి లేకపోవడం వల్ల బయటి నుంచి మంచినీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందని, కామన్ మెనూ లో ఉన్న ఆహారం అరకొరగానే అందుతున్నాయని అందువల్ల కడుపునిండక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఆట పరికరాలు కూడా అందుబాటులో లేవని విద్యార్థులు మహేష్ కి తెలియజేశారు. విద్యా దీవెన వసతి దీవెన అసలు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదని విద్యార్థులు ఖాతాకు డబ్బులు జమ చేస్తూ తిరిగి వారి దగ్గర నుంచి కళాశాల యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయని దీనివల్ల ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని విద్యార్థులు మహేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ హాస్టల్ నిర్వహణలో వార్డెన్ నిర్లక్ష్య వైఖరిని చాలా స్పష్టంగా కనబడుతుందని, విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం హక్కు ఎవరికీ లేదని, కూతవేటు దూరంలో నివాసం ఉండే మేయర్ భాగ్యలక్ష్మి ఇక్కడ వసతులను పరిశీలించకపోవడం వారి నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందని, స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు గడపగడపకు అంటూ ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారు గానీ నియోజకవర్గంలో ఒక్క సమస్య కూడా పరిష్కరించడం లేదని, వారం రోజుల్లో హాస్టల్ లోని సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే హాస్టల్లో వసతులు మెరుగుపర్చాలని మహేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు బుద్ధన ప్రసాద్ పాల్గొన్నారు.