కావలి ( జనస్వరం ) : కావలి నియోజకవర్గంలో రోజూ నిత్యం వందలాది మందికి ” పవనన్న అన్నం బండి ” ద్వారా ఆకలిని తీరుస్తున్నారు జనసేన నాయకులు సిద్ధూ. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా మంది పేదవాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారని, అలాంటి వారి కోసం జనసేన పార్టీ ద్వారా ఆకలిని తీరుస్తున్నానని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పేదల ఆకలి తీర్చేందుకు ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ పేరు మీదుగా ఆహార శిబిరాలను ఏర్పాటు చేశారన్నారు. అలాగే జనసేన పార్టీ మ్యానిఫెస్టోలో డొక్కా సీతమ్మ పేరు మీదుగా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చామని అన్నారు. గత పాలకులు అన్న క్యాంటీన్ల పేరు మీదుగా పేదలకు భోజన సౌకర్యాలను కల్పించారని, అయితే ఆ ఆ పథకంలో అక్రమాలు జరిగాయని చెబుతూ వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని తీసేయడం దారుణమని అన్నారు. ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే విచారణ జరిపి వారి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కానీ పేదలకు భోజన సౌకర్యాన్ని నిలిపియేయడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోందని అన్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఉంటూ ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉండేవాడినని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించాక, పార్టీ సిద్దాంతాలు నచ్చి పార్టీ బలోపేతం కృషి చేస్తూ నియోజకవర్గంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తూ పోరాడేవాడినన్నారు. 2019 ఎన్నికల్లో ఒక అజ్ఞాత వ్యక్తి జనసేనపార్టీ ఎన్నికల్లో పోటీ చేసి చివరికి వేరే పార్టీకి మారినా, నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానన్నారు. పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు “యువతా మేలుకో” కార్యక్రమ౦ చేపట్టమన్నారు. నియోజకవర్గంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి చాలా పేద వాళ్ళు వైద్యం చేయించుకోవడానికి వస్తుంటారు. బయట హోటళ్లలో తినాలంటే అధిక ధరలు ఉన్నాయన్నారు. అందుకే వారి కోసం జనసేన పార్టీ తరుపున “డొక్కా సీతమ్మ” పేరు మీదుగా పవనన్న అన్నం బండి ద్వారా నిత్యం వందలాది మందికి భోజనాన్ని అందిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తామని అన్నారు. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని పేదలకు అన్నం అందించే ఆహార పథకాన్ని అందించాలని కోరుతున్నానన్నారు.