– కార్యకర్తల ఉత్సాహం నడుమ ఘనంగా జరిగిన 50వ రోజు పవనన్న ప్రజాబాట
– “ఉద్యమాల ముద్దుబిడ్డ కేతంరెడ్డిరో… ప్రతి గడపకు పవనన్న ప్రజాబాటలో” ప్రత్యేక గీతం విడుదల
– మైపాడు గేటు సెంటర్ లో 50వ రోజు స్మారక స్థూపం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరించిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి
– 50 రోజుల్లో సుమారు పన్నెండు వేల కుటుంబాలను పలుకరించి అధ్యయనం చేసిన ప్రతి సమస్యపై పోరాడుతామని, పరిష్కారం కాని సమస్యలను పవనన్న ప్రభుత్వంలో తీరుస్తామన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గత 50 రోజులుగా జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 50వ రోజున మైపాడు రోడ్డు ప్రధాన దారిలో వందలాది మంది కార్యకర్తల నడుమ ఉత్సాహంగా జరిగింది. తెలంగాణ జనసైనికులు అభిమానంతో పంపిన “ఉద్యమాల ముద్దుబిడ్డ కేతంరెడ్డిరో… ప్రతి గడపకు పవనన్న ప్రజాబాటలో” అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని విడుదల చేసిన అనంతరం మైపాడు రోడ్డు చేపల మార్కెట్ నుండి మైపాడు గేటు సెంటర్ వద్దకు ర్యాలీ జరిపి 50వ రోజు స్మారక స్థూపం ఏర్పాటు చేసి జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 3, 4, 5 డివిజన్లలో సుమారు 12000 కుటుంబాలు ఉంటే ఒక్క కుటుంబాన్ని కూడా విస్మరించకుండా గత 50 రోజులుగా ప్రతి ఒక్కరి దగ్గరకి వెళ్ళి ప్రజా సమస్యల అధ్యయనం చేయడం జరిగిందన్నారు. మైపాడు రోడ్డు ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉండే సింహపురి కాలనీ, వేణుగోపాలనగర్, వెంగళరెడ్డినగర్, రాజీవ్ గాంధీ కాలనీ, జాఫర్ సాహెబ్ కాలువ కట్ట, జాకీర్ హుస్సేన్ నగర్, కిసాన్ నగర్, మధురా నగర్, సత్యనారాయణపురం, మారుతీ నగర్ , శ్రీరామ్ నగర్ , బాలకృష్ణ స్టోర్ వీధి , కుందేళ్ళ ఫారం వీది ,బర్మాశాల గుంట , వైకుంఠాపురం, బోడిగాడితోట, బర్మాషెల్ గుంట, అహ్మద్ నగర్, ఇలా అనేక ప్రాంతాలలో .. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్య ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమను తమ కుటుంబ సభ్యుని వలె ఆదరించారని, వారి అపూర్వ ఆదరణతో తమలో ఎంతో ఉత్సాహం వచ్చిందన్నారు. ముస్లింలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం, అమ్మఒడిలో లోపాలు, ఫీజు రీయంబర్సుమెంట్ లో లోపాలు, అవ్వాతాతలు దివ్యాంగులు వితంతువుల పింఛన్ల సమస్యలు, అంగన్ వాడీ సిబ్బంది సమస్యలు, యువతకు జాబ్ క్యాలండర్ అని మోసం చేసిన వైనం, బర్మాషెల్ గుంట వంటి ప్రాంతాల్లో ఇళ్ళ తొలగింపు, టిడ్కో ఇళ్ళు ఆరు అంకణాల స్థలాల్లో వైసీపీ మోసాలు, అర్హులకు అందని వైనం, దేశంలో ఎక్కడా లేని కారణాలు చూపి రేషన్ కార్డులు తొలగించి పేదలను సంక్షేమ పథకాలకు దూరం చేయడం, నిరుపేదలకు ప్లాస్టిక్ బియ్యం పంపిణీ, నిత్యావసర ధరల పెరుగుదల కష్టాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 50 రోజుల్లో అనేక సమస్యల అధ్యయనం జరిపామని అన్నారు. తమ పరిధిలో పరిష్కారమవగల సమస్యలను తామే పరిష్కరించామని, కొన్నింటిని సంబంధిత వార్డు సచివాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యేలా చేశామని, కొన్నింటిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం అని కేతంరెడ్డి వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలను అన్నింటినీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నామని, ప్రజలందరి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాగానే పవనన్న ప్రభుత్వంలో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని అన్నారు. ప్రతి ఇంటికి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహాన్ని తీసుకెళ్తున్నామని, ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని, ప్రజల ఆశీర్వాదంతో రానున్న రోజుల్లో నెల్లూరు సిటీ గడ్డని జనసేన అడ్డాగా మారుస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు, జిల్లా నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళీ రెడ్డి, ఆమంచర్ల శ్రీకాంత్, స్థానిక నాయకులు మోష, జీవన్, హుస్సేన్, సంజయ్, కుక్కా ప్రభాకర్, హేమంత్ రాయల్, కార్తీక్, జాఫర్, శ్రీకాంత్, ఈశ్వర్,సురేష్ , దిలీప్ , చరణ్, నాగరాజు, వీరమహిళలు శిరీషారెడ్డి, సునంద, కుసుమ, ఝాన్సీ, సుజాత, షాహీనా, రజియా తదితరులు పాల్గొన్నారు.