ఎమ్మిగనూరు, (జనస్వరం) : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిన వైసీపీ పాలకులు ప్రజల ఆగ్రహానికి గురికాక ముందే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే జనసేన ఆధ్వర్యంలో భారీ ఎత్తున్న ఉద్యమాలు చేపడతామన్నారు. ఎమ్మిగనూరు ఇంచార్జి రేఖగౌడ్ పిలుపు మేరకు మండల కేంద్రమైన గోనెగండ్ల పరిధిలోని బిసి కాలనీలో జనంలోకి జనసేన కార్యక్రమన్ని ఎమ్మిగనూరు జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా, ఖాసీం సాహెబ్, మాలిక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా బిసి కాలనీ వాసులు సిసి రోడ్లు, డ్రైనేజి సమస్యలు ఎదుర్కుంటున్నారని, స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం విధుల్లో తిరిగి హామీలు ఇచ్చిన పాలకులు కార్యాలయాలకు పరిమితం అయ్యారని పాలకులకు ఎన్నికల ముందు కనిపించిన సమస్యలు గెలిచిన తరువాత కనపడటం లేదా అని ప్రశ్నించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయసాధన కోసం నిత్యం ప్రజల్లో వుంటూ జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ చేస్తున్న ప్రజాపోరాట యాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని హెచ్చరించారు. గాజులదిన్నె జలాశయంలో భూములు కోల్పోయిన రైతులను అన్నివిధాలుగా ఆదుకోవాలని గోనెగండ్ల మండల ప్రజలకు జలాశయం నుంచి ప్రజలకు త్రాగునీరు, రైతులకు సాగునీరు అందించేందుకు పాలకులు కృషిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాబాష,రవి కుమార్, అలీ బాషా, మహబూబ్ బాషా, రంగస్వామి, మధు, పాల్గొన్నారు,