విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్బంగా దాసన్నపేట రైతు బజారు జంక్షన్ వద్ద, అల్లూరి సీతారామరాజు సేవాసంస్థ నెలకొల్పిన సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఆ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం తమ పరిపాలన విస్తరణలో భాగంగా కొండజాతి ప్రజలను దోచుకొనే మార్గానికి తెరలేపింది. గిరిజనుల శ్రమను, పండించిన పంటఫలాల, ప్రకృతి సిద్దమైన ఫలసాయంపై బ్రిటిష్ వారు దోచుకొని, వారికీ స్వేచ్ఛ లేకుండా బానిసలుగా మార్చివేసిన తరుణంలో గిరిజనలకు ఆశాకిరణంగా, విప్లవ జ్యోతిఅయ్ బ్రిటీష్ వారిపై తిరిగుబాటు చేసి మన బంగారు భవిష్యత్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), దంతులూరి రామచంద్ర రాజు, మిడతాన రవికుమార్, సారిక మురళి మోహన్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, చెల్లూరి ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్, అల్లబోయిన శివ, ముక్కిీ కుమార్, దువ్వి రాము, సీర కుమార్, గూడ రాజేష్, చుక్కరవి, నాని తదితరులు పాల్గొన్నారు.