కడప ( జనస్వరం ) : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, మూడవసారి ముచ్చటగా బస్ చార్జెస్ పెంచుతూ నోటిఫికేషన్ జూన్ 30 నా విడుదల చేసింది. డీజిల్ రేట్స్ పెరగటం వలన పెంచారు అని కాకమ్మ కథలు చెబుతున్నారని కడప జనసేన నాయకులు అన్నారు. వారు మాట్లాడుతూ దాదాపు 720 కోట్లు ప్రజల పైన భారం పడుతోందని అన్నారు. ఇలా టీడీపీ, వైసీపీ ఎవరు వచ్చిన సామాన్య ప్రజలపై పెను భారం పడుతోందని అన్నారు. ఆస్తి పన్ను, చెత్త పన్ను, విద్యుత్ చార్జెస్ ఇలా ప్రజల్ని చాకిరేవు వేసి బాది నట్లు బాదుతున్నారు. మన దగ్గర నుంచి వివిధ రకాల పన్నులు వసూలు చేసి మనకి వేదో మంచి చేసినట్లు డ్రామాలు ఆడుతున్న టీడీపీ, వైసీపీకి బుద్ది చెప్పాలన్నారు. చిల్లర ఓట్లు కొనడానికి మనకి పడవేసి, కోట్లు వెనుక వేసు కుంటున్నారు. ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని అన్నారు. అధికారంలోకి వచ్చాక రెండు సార్లు ఆర్‌టిసి చార్జెస్ పెంచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్‌టిసి చార్జెస్ పెంచం అన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు విరుసు పడతారు, అధికారంలోకి రాగానే మల్లి అదే చేస్తారు. ఏమిటో ఈ విడ్డురం అని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. అనంతరం డిపో మేనేజర్ కు వినతి పత్రాన్ని అందించారు.