పంతాలకు పోయి ప్రయాణీకులకు నరకం చూపిస్తున్న అధికారులు : లక్ష్మణ కుటాల

లక్ష్మణ కుటాల

   కదిరి ( జనస్వరం ) : అననతపురం ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల మాట్లాడుతూ కదిరి మున్సిపల్ అధికారులపై ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ పంతాలకు, పట్టింపులకు పోయి కదిరి పట్టణంలోని కాలేజ్ సర్కిల్ నుంచి వలిసాబ్ రోడ్డు వరకూ ప్రజాధనాన్ని నిర్వీర్యం చేశారన్నారు. రోడ్డు పూర్తిస్థాయిలో వెయ్యకుండా, రోడ్డుకు ఇరువైపులా కాలువల నిర్మాణం చేపట్టకుండా, మార్గం మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండా, హడావిడి చేసి అసంపూర్ణంగా రోడ్డు పనులు చేశారు. పూర్తిగా చేశారా అంటే అదీ లేదు, మొన్న కురిసిన వర్షానికి కాలువల్లో ప్రవహించే మురుగు నీరు మొత్తం మోకాళ్ళ లోతువరకు నిలిచాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారాలు సదరు రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు మధ్యలో వేసిన డివైడర్ కి పెద్ద పెద్ద రంధ్రాలు చేసి తాత్కలికంగా ఉపశమనం కల్పించారు. రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఏదైనా వాహనం ఢీ కొంటే అనుకోని ప్రమాదం జరిగితే మాత్రం అందుకు పూర్తి బాధ్యత విద్యుత్, మునిసిపల్ అధికారులే వహించాల్సి ఉంటుందని అన్నారు. రోడ్డు మధ్యలో గ్రాఫిక్స్ లాగా అత్యంత సుందరంగా రహదారి తీర్చి దిద్దుతాము అని చెప్పి డివైడర్ మధ్యలో మట్టి వేసి మొక్కలు పెట్టి వాటి కోసం వాటర్ డ్రిప్పులు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఒక్క మొక్క కూడా లేదు, కానీ బిల్లులు మాత్రం చేసుకున్నారు. ప్రజలకు, ప్రజాధనానికి జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు వారి నిర్లక్ష్యం కారణంగా రోడ్డు పనులు చేసే వాళ్లకు నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పని చేస్తే బాగుంటుందని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way