రైల్వేకోడూరు, (జనస్వరం) : రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లె మండలం శివ శంకర పురం గ్రామంలో జనసైనికులకు క్రియాశీలక కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు మాట్లాడుతూ దసరా నుండి జనసైన్యం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేందుకు యజ్ఞం చేయబోతోంది అన్నారు. ఇందులో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన సైన్యం సేనాధిపతి, ప్రజలకు సేవాధిపతి. పవన్ దెబ్బకు నీరు నిప్పు ఆవిరి మేఘంగా మారి వర్షించి, భువిని సస్యశ్యామలం చేస్తున్నట్లు పవన్ యజ్ఞం దెబ్బకు దుష్టశిక్షణ, శిష్టరక్షణ జరిగి దుష్ట నాయకుల అబద్ధాలు, అవినీతి ప్రజల ముందు తేట తెల్లం అవుతాయని తెలిపారు. అందుకు అధోగతిలో ఉన్న రాష్ట్రాన్ని ప్రజలను ఉద్ధరించడానికి జనసైన్యానికి అధికారం కావాలన్నారు. అధికారం సాధించాలంటే మనకు ఓట్లు కావాలని దాదాపు 80 శాతం పైన ఓట్లు లక్ష్యంగా ప్రతి జనసైనికుడు పనిచేయాలన్నారు. అంతటి గొప్ప లక్ష్యాన్ని మనం సాధించాలంటే జనసైన్యం అనగా క్రియాశీలక కార్యకర్తల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన యజ్ఞం ప్రజల కోసమే అన్న విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. అందుకు రైల్వేకోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా కనీసం వంద కోట్లకు ఒక క్రియాశీలక కార్యకర్త చొప్పున నియోజకవర్గ వ్యాప్తంగా పెంచాల్సిన ఆవశ్యకత గురించి తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు ఉన్న ప్రతి జనసైనికుడు తమ వంతు బాధ్యతగా 100 ఓట్లకు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని క్రియాశీల కార్యకర్తగా మార్చాలి అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకాన్ని ఓట్లుగా మలుచుకోవాలి అన్నారు. గర్జన శబ్దం పెంచితే సరిపోదు. గర్వించే గొంతుకల సంఖ్య పెంచాలన్నారు. ఇందుకు ప్రతి జనసైనికుడు, వీరమహిళలు, జనసేన నాయకులు అందరూ సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదం సుబ్రమణ్యం, కిషోర్, సుబ్బయ్య, రెడ్డి మణి, శివ శంకరాపురం గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.