– ప్రతి పాఠశాల, కళాశాలలో అత్యాధునిక బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సౌకర్యం, డిజిటల్ క్లాసురూములు ఏర్పాటు చేస్తాం
– ఉపాధ్యాయుల కొరత లేకుండా ప్రతి ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం
– ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సాంకేతిక కళాశాలల్ని ఏర్పాటు చేస్తాం
– డిగ్రీ, పీజీ చదువులు చదివే 18 ఏళ్ళు నిండిన విద్యార్థినులకు స్కూటీ తరహా మోపెడ్ లు ఉచితంగా అందిస్తాం
– జాతీయ విద్యావిధానం ప్రకారం ఇంగ్లీష్ మీడియం ను ప్రోత్సహిస్తూ తెలుగు మాధ్యమాన్ని గౌరవిస్తాం
– వైసీపీ ప్రభుత్వ అమ్మఒడి డబ్బు ఎనభై శాతం మేర వృధా అవుతోంది తప్పించి విద్యా లక్ష్యాలను నెరవేర్చట్లేదు
– పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 43వ రోజున స్థానిక మైపాడు రోడ్డు పి.సి.నాయుడు నగర్ లో జరిగింది. ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. మెగా డీఎస్సీ చేపట్టి పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆ హామీని విస్మరించి ఇప్పుడు నాడు నేడు పేరుతో హంగులు చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అమ్మఒడి పేరుతో ప్రజలకు ఉచితంగా వేస్తున్న డబ్బు విద్యా వ్యవస్థ మెరుగుకు దోహదం పడుతుందా, లక్ష్యాలను అందుకుంటుందా పర్యవేక్షించే పరిస్థితే కనపడడం లేదన్నారు. ఎనభై శాతానికి పైగా అమ్మఒడి డబ్బు వృధా అవుతోందని, విద్యార్థులకు మెరుగైన బోధనా వసతులు కల్పించేందుకు ఉపయోగిస్తే లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు జరిగి పేద విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. పవనన్న ప్రభుత్వంలో ప్రతి పాఠశాల, కళాశాలలో అత్యాధునిక బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సౌకర్యం, డిజిటల్ క్లాసురూములు ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా ప్రతి ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. డిగ్రీ, పీజీ చదువులు చదివే 18 ఏళ్ళు నిండిన విద్యార్థినులకు స్కూటీ తరహా మోపెడ్ లు ఉచితంగా అందిస్తామన్నారు. జాతీయ విద్యావిధానం ప్రకారం ఇంగ్లీష్ మీడియం ను ప్రోత్సహిస్తూ తెలుగు మాధ్యమాన్ని గౌరవిస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సాంకేతిక కళాశాలల్ని ఏర్పాటు చేస్తామన్నారు. జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్శిటీలలో కాంట్రాక్టు అధ్యాకులకు న్యాయం చేస్తామని, విద్యార్థులు అధ్యాపకుల నిష్పత్తికి తగినట్లుగా నూతన నియామకాలు చేపడతామని అన్నారు. జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుండే ఈ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.