● పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే అమలయ్యే ప్రణాళిక ఇది
● జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో ఓ భాగం
● ఏటా ఏపీపీఎస్సీ ద్వారా 25వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
● పోలీస్ శాఖలో 6500 ఉద్యోగాలు భర్తీ చేస్తాం
● ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహకాలు ఇచ్చి 5 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తాం
● పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 42వ రోజున మైపాడు రోడ్డు సత్యనారాయణపురం 1వ విధులో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించి సమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రతి చోట యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నాలుగున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీలు ఇచ్చి నేడు మడమ తిప్పారని విమర్శించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటర్ల నియామకం చేపట్టారని, ఆ నియామకాలు చేపట్టే సమయంలో నాలుగున్నర లక్షల ఉద్యోగాల గురించి త్వరలో జాబ్ క్యాలండర్ వేస్తామని తెల్పితే యువత ఇప్పటికి కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం నియామకం చేసిన గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు కూడా నేడు చాలీచాలని జీతాలతో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గతేడాది జూన్ లో ఆరు లక్షల ఉద్యోగాలు అంటూ ఒక నకిలీ జాబ్ క్యాలండర్ విడుదల చేసారని, ఆ క్యాలండర్ లో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు అని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు. జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలోని ప్రణాళిక ప్రకారం పవనన్న ప్రభుత్వంలో ప్రతి ఏటా ఏపీపీఎస్సీ ద్వారా 25 వేల ఉద్యోగాల భర్తీ చేపడతామన్నారు. ఖాళీగా ఉన్న 6500 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ప్రైవేట్ రంగానికి కూడా ప్రోత్సాహకాలు అందించి 5 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించేందుకు పవన్ కళ్యాణ్ నిబద్ధతతో ఉన్నారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.