మదనపల్లె, (జనస్వరం) : మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. చినుకు పడితే మార్కెట్లు నీటి నిల్వలతో బురదమయంగా మారుతుంది. పారిశుద్ధ్య పనులు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రైతులు తీసుకొచ్చిన టమాటా బురదలోనే క్రేట్లను పెట్టాల్సి వస్తోంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత తెలిపారు. వర్షపు నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో నీరంత మార్కెట్ యార్డ్ లో నిలబడిపోయి వాహనాల రాకపోకలతో ఇబ్బందిగా మారిందని, హమాలీలు, రైతులు బురదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మార్కెట్లోని కాలువలో జగన్ తో పాటు టమాటాలతో నిండిపోయి నీరు పోయేందుకు వీలు లేకుండా ఓడిపోయింది మార్కెట్లో వర్షపు నీరు నిలబడిపోయింది. ప్రస్తుతం వెయ్యి టన్నుల వరకు మార్కెట్ కు వస్తున్నాయి. వచ్చిన హమాలీలు గ్రేడింగ్ చేస్తారు. ఇందులో ఎగుమతికి పనికిరాని పగిలిపోయిన కాయలను ఈ వ్యాపారులు ఏం చేస్తున్నారు. దీన్ని బయటకు తరలించడంతో వర్షపు నీరు పడి అధ్వానంగా మారిందని, గ్రేడింగ్ చేసేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో వర్షపు నీరు వెళ్లేందుకు అంతర్గత డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాల్సి ఉంది గ్రేడింగ్ చేసిన టమాటాలు కుళ్లిపోయిన కాయలను నిల్వ పెట్టకుండా ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డ్ కి తరలిస్తే దుర్వాసన లేకుండా ఉంటుంది. అధికారులు చొరవ తీసుకొని మార్కెట్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని రైతులు వ్యాపారులు కోరుతున్నారని తెలిపారు. మార్కెట్లో పారిశుద్ధ్య పనులు చేయించి చెత్తాచెదారాన్ని కుళ్ళిపోయిన టమాటాలను దూరంగా తరలించే చర్యలు తీసుకోవాలని జనసేనపార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.