
శ్రీకాకుళం ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిన్నపిసిని గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కరి మజ్జి మల్లేశ్వర రావు ఉపాధి కూలీలను, రైతాంగాన్ని, కార్మికులను, విద్యార్థులను, మహిళలను అన్ని వర్గాలను కలిసి పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఎన్నికల మేనిఫెస్టోను గూర్చి వారికి తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్రానంతరం అనేక ప్రభుత్వాల పనితీరును మనందరం చూసామని అయినప్పటికీ అనేకమందికి ప్రగతి ఫలాలు అందడం లేదని ఆయన ఆవేదన చెందారు. ఈ రోజుల్లో కూడా ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట తినడానికి, తిండి లేక అనేకమంది ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. ఉపాధి లేక వలసలు పోతున్నారని విద్యావంతులకు ఉద్యోగావకాశాలు కొరత ఏర్పడుతుందని అనేక ఏళ్లుగా భ్రష్టు రాజకీయాలతో అవినీతి లంచగొండితనం పెరిగిపోయి అనేక కుటుంబాల జీవన స్థితిగతుల మారి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి మంచి నాయకత్వం, నాయకుడు కావాలని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటందని అన్నారు. కావున రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంత్రిగా గెలిపించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని అన్నారు.