
చంద్రగిరి ( జనస్వరం ) : చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, దామలచెరువు గ్రామం నందు నివాసం ఉండే రఫీ, గౌసియా ల కుమార్తె అరీఫా పెళ్లి కొరకు జనసేన పార్టీ తరపున చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్, జనసేన నాయకులు దినేష్,సోహైల్, మస్తాన్, చాంద్ బాషా సహాయ సహకారాలతో 12000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ పేద ముస్లిం మహిళ చెల్లమ్మల వివాహానికి వైయస్సార్ పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇస్తాం అని చెప్పిన జగన్ రెడ్డి గారి ప్రభుత్వం గత మూడేళ్లుగా ఒక్కరంటే ఒక్కరికైనా ఇచ్చారా, మాట తప్పం,మడమ తిప్పం అంటే ఇదేనా ? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం లో పాకాల మండల అధ్యక్షులు గురునాథ్ తలారి, వాసు రాయల్, నౌమూన్, షాజహాన్, రహంతుళ్ళ పాల్గొన్నారు.