
కృష్ణా ( జనస్వరం ) : నూజివీడు నియోజకవర్గ ముసునూరు మండలంలో రమణక్కపేట,అక్కిరెడ్డిగూడెం, చెక్కపల్లి గ్రామాల్లో జనసేన పార్టీ క్రీయాశీలక కార్యకర్తలకు సభ్యత్వం కిట్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, మండల కార్యవర్గ సభ్యులు వేట త్రినాథ్, జుంజునూరి ఏడుకొండలు, తోట వాసు, చేకూరి అనిల్, ప్రసాద్, స్వామి, బొందల రాము, పవన్, ఉప్పే వంశీ పాల్గొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు మాట్లాడుతూ కార్యకర్తల శ్రేయస్సు కోసం అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి గొప్ప స్కీం ప్రవేశపెట్టడం అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జనసేన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసే వరకూ పోరాడదామని అన్నారు.