
గుంతకల్ ( జనస్వరం ) : ముస్లిం మైనారిటీల పట్ల వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం అమలులో ఉన్న పథకాలు సైతం రద్దు చేయడం వైసీపీ ప్రభుత్వానికి ముస్లింల పట్ల చిత్తశుద్ధి నిరూపిస్తోంది అని జనసేన నాయకులు ఫిరోజ్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ముస్లిం యువతులకు అందజేసిన పథకాన్ని రద్దు చేయడం అంటే ముస్లిం సమాజంలో నిర్లక్ష్యం చేసినట్టవుతుందని అన్నారు. సాక్షాత్తు హైకోర్టులో పథకాన్ని రద్దు చేశామని పేర్కొనటం ఈయనకు ముస్లింల పట్ల ఉన్న ప్రేమ చిత్తశుద్ధి ఎంత ఉందో తెలుస్తోందన్నారు. ముస్లింల పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఆదరించి ఆశీర్వదించ ఆశీర్వదిస్తే సంక్షేమ అభివృద్ధి పథకాలు ముస్లింలకు అందుతాయని జనసేన పార్టీ గుంతకల్లు మైనార్టీ నాయకులు ఫిరోజ్ ఖాన్ పేర్కొన్నారు.