పామిడి ( జనస్వరం ) : అమ్మ ఒడి పథకాన్ని కొనసాగించడం చేతకాక, నిధులు లేక అప్పులు దొరకక అమ్మఒడి పథకానికి మంగళం పాడేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనల పేరుతో అర్హులైన వారిని కూడా అనర్హులుగా ప్రకటిస్తున్నారని పామిడి మండల అధ్యక్షుడు యం.ధనుంజయ పత్రికాముఖంగా ఆరోపించారు. విద్యుత్తు వాడకం నెలకు 300యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం అందదని అన్నారు. నవంబరు 8 నుంచి ఏప్రిల్ 30 వరకు విద్యార్థి హాజరు 75శాతం లేకపోయినా అమ్మఒడి ప్రయోజనం పొందలేరు. బియ్యం కార్డు కొత్తది ఉండాలి. బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకు చేసుకోవడం, బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయో లేవో విద్యార్థుల తల్లిదండ్రులు తనిఖీ చేసుకోవాలి అంటూ తల్లిడదండ్రులను ముప్పతిప్పలు పెట్టారన్నారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలను ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిందని ఈ నిబంధనల ప్రకారం ఏపీ వ్యాప్తంగా లక్షమందికి పైగా విద్యార్థులు అమ్మఒడి పథకానికి అనర్హులయ్యారని అన్నారు. జగన్ రెడ్డి గారి చేతగాని పరిపాలన వల్ల ప్రజలు వంచనకు గురవుతున్నారని ఇలాంటి చెత్త పరిపాలనకు ప్రజలు కూడా మంగళం పాడే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు.