9 టేకు చెట్లు మాయం… బాధ్యులపై చర్యలు తీసుకోండి : MPTC అనురాధ డిమాండ్

MPTC అనురాధ

        రాయవరం : రాయవరం మండలం చెల్లూరు గ్రామ శివారులో 9 టేకు చెట్లు మాయం అయ్యాయని  MPTC అనురాధ ఆమె స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరించారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. చెల్లూరు గ్రామ శివారు లో సర్వే నెంబర్ 176 లో ఉన్న సుమారు 5 లక్షల రూపాయలు విలువచేసే 9 టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ పంచాయితీ అధికారుల అనుమతి లేకుండా నరికివేశారన్నారు. దీనిపై చర్యలు కోరుతూ పిర్యాదు అధికారులకు చేశామని పేర్కొన్నారు.

See also  పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : మామిడికుదురు జనసేన నాయకులు