Search
Close this search box.
Search
Close this search box.

అగ్నిపథ్ పథకం అంటే ఏమిటి ? లాభమా ?? నష్టమా ???

అగ్నిపథ్

             కేంద్రం సైన్యంలో చేరాలని దేశ సేవ చేయాలని ఉన్న వారి కోసం అగ్నిపథ్ అనే నియామక ప్రక్రియని తీసుకొని వచ్చింది. మోడీ ఏమీ చేసినా వ్యతిరేకం అనే ప్రతిపక్షాలు దీన్ని కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇప్పుడే కాదు కాశ్మీర్ కి ఆర్టికల్ 370డీ రద్దు చేసి కాశ్మీర్ ను భారత్ లో కలిపిన కూడా దేశ వ్యాప్తంగా గొడవలు చేశాయి.
అసలు అగ్నిపథ్ వల్ల ఉపయోగం ఎంటో చూద్దాం…

          ఇజ్రాయిల్ లాంటి దేశాల లో 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి సైన్యంలో మూడు నాలుగు ఏళ్ళు పని చేయాలి. అలా ఉండటం మూలంగానే ఇజ్రాయిల్ లాంటి దేశాలలో 100 శాతం దేశ భక్తులు ఉంటారు. ఇజ్రాయిల్ చుట్టూ మొత్తం ముస్లిం దేశాలు ఉన్నా కూడా ఇజ్రాయిల్ వైపు కన్నెత్తి కూడా చూడలేవు. ఎందుకంటే ఆ దేశంలో ప్రతి వ్యక్తి సైన్యంలో పని చేసి బయటకు రావడం మూలంగా అందరూ దేశం కోసమే పని చేస్తారు. ఇప్పుడు మన దేశంలో ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ కూడా అటువంటిదే. 18 ఏళ్ల నుండి 21 ఏళ్ల యువకులకు సైన్యంలో తీసుకొని ఎంపిక అయిన వారికి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి నెలకు 30వేల నుండి 40వేల రూపాయల జీతం ఇస్తారు. 4 ఏళ్ల తరువాత వారిలో సామర్ధ్యం, ప్రతిభని బట్టి 25 శాతం మందిని వారు మళ్ళీ అప్లై చేస్తే శాశ్వతంగా సైన్యంలోకి తీసుకుంటారు. 4ఏళ్లు నిండిన వారికి 12 లక్షల రూపాయలు మరియు  సర్టిఫికేట్ ఇచ్చి గౌరవంగా పంపిస్తారు. 4 ఏళ్ల కాలంలో 12 లక్షల రూపాయల సంపాదన లభిస్తుంది. క్రమశిక్షణ గల వీరులుగా సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. తదుపరి చదువుల కోసం బ్రిడ్జింగ్ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. అనంతరం అమ్మాయిలకు కూడా ఈ అవకాశం ఇస్తామని చెబుతున్నారు. అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు. సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం అభ్యర్థులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తారు. సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే పరిహారం అందిస్తారు. వైకల్యం 100 శాతం ఉంటే 44 లక్షలు, 75 శాతమైతే 25 లక్షలు, 50 శాతమైతే 15 లక్షల రూపాయల పరిహారం ఇస్తారు.ఉద్యోగం పొందాలనుకునే వారికి కూడా ఈ నాలుగేళ్ల సర్వీస్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ సర్వీస్‌లో పాల్గొన్న యువతకు సీఏపీఎఫ్(CAPF), రాష్ట్ర పోలీసుల నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇతర రంగాలలో కూడా వారికి అనేక అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. ఇలా వారి భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉంటుంది. అగ్నిపథ్ పథకం వల్ల రెజిమెంటల్ వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదు. నిజానికి ఈ పథకం వల్ల అగ్నివీరులలో అత్యుత్తమమైన యువత సెలెక్ట్ అవుతారు. తద్వారా సాయుధ బలగాల బృందం సమన్వయాన్ని మరింత పెంచినట్లు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంటూ అగ్నిపథ్ పథకంలో చేరి 4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చే వారికికోస్ట్ గార్డ్స్, డిఫెన్స్ సివిల్ పోస్టులు సహరక్షణ శాఖ పరిధిలోని 16 సంస్థల్లో ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు ఇస్తామని తెలిపారు.  
              18 ఏళ్ల నుండి 21 ఏళ్లలో ఖాళీగా ఉండే యువత చెడుదారులకు వెళ్లకుండా సైన్యంలో చేరితే మంచి వాడుగా ఉంటాడు. దేశ భక్తుడు అవుతాడు.18 ఏళ్ల నుండి 21 ఏళ్ల మధ్యలో మంచి సంపాదన పరుడు అవుతాడు. బాధ్యత గల పౌరుడు అవుతాడనే మంచి ఉద్దేశంతో ఈ పథకం పెట్టారు. జాబ్ లు రాక 30 ఏళ్ల వరకు వేచి చూసే కంటే ఈ పథకం బాగానే ఉంది కదా. అలాగే 4 ఏళ్లు పూర్తిగా సైన్యంలో పని చేసిన వారిని అన్ని ప్రవైట్ కంపెనీలు తీసుకుంటాయి. లేదా ప్రభుత్వం ఇచ్చే 12 లక్షలతో ఏదైన వ్యాపారం చేసుకోవచ్చు.  ముద్రా లాంటి లోన్స్ లభిస్తాయి. ప్రతిపక్షాల భయం ఎంటి అంటే యువత ఇలా సైన్యంలో జాయిన్ అయితే వారికి ఎవ్వరూ ఓటు వేయరు. వారు ఇచ్చే బీర్, బిర్యానీ, డబ్బులకు సైన్యంలో పని చేసిన వచ్చిన వాడు ఎవ్వరూ ఆశ పడి ఓటు వేయరు. అయిన బస్సులు, రైలు తగల బెట్టే వారు ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టే వారు సైన్యంలోకి ఎలా వెళ్తారు. దేశ భక్తుడు ఎలా అవుతాడు అని ప్రభుత్వం అంటోంది. నిజానికి పోరాటం చేస్తున్న నిరుద్యోగులు అందరూ కొన్ని రాజకీయ పార్టీల ప్రమేయానికి ఆకర్షితమై వారు చెప్పినట్లుగా విని ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిజంగా సైన్యంలో పని చేయాలనుకునే వ్యక్తులు దేశ సంపదను, దేశ ప్రజలను కాపాడుతారు. సికింద్రాబాద్ లో రైల్వే ఆస్తులను తగలబెట్టడం అంటే ప్రజల ఆస్తులను, దేశ ఆస్తులను తగలబెట్టినట్లే. దేశ ఆస్తులను ఇపుడే కాపాడలేని వారు ఇక సైన్యంలో చేరి దేశానికి ఏం సేవ చేద్దామని అనుకుంటున్నారు. వారు నిజంగా తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి అనుకుంటే శాంతియుతంగా చేయొచ్చు. ఇలా ప్రయాణీకులను ఇబ్బంది పెట్టి, ఆస్తులను ధ్వంసం చేయడం వల్ల వారి క్రమశిక్షణారాహిత్యం కనిపిస్తోంది. తక్కువ కాలంలో దేశానికి సేవ చేసి, స్వంతంగా పారిశ్రామికంగా ఎదగాలనుకునేవారికి ఇదొక గొప్ప అవకాశం. 

 – Written By 

జమ్ము సాయి కళ్యాణ్ 

ట్విట్టర్ ఐడి : @kalyan_sj 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
20240229_211424
వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..
FB_IMG_1709197150391
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తనను తాను తగ్గించుకొన్న జనసేనాని
20240225_134850
నాయకుడు తీసుకున్న నిర్ణయం తప్పా ? రైటా??
జనసేన
జనసేన - నా సేన కోసం నా వంతు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way