
కడప ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో చేపట్టిన విషయం తెలిసిందే. సదరు యాత్రకు కడప జిల్లా నుండి ప్రకాశం జిల్లాలో జరిగే యాత్రకు జనసైనికులు ఎవరు వెళ్లనివ్వకుండా, పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు మాలే శివాకి చిన్న చౌకు పోలీసులు నోటీసు ఇవ్వడం జరిగింది. ఇలా నోటీస్ ఇవ్వడంపై జనసైనికులు అంతా రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని పరిపాలించడానికి చేతకాక ఇలా అక్రమ నోటీసులు ఇస్తూ పోలీసుల చేత బెదిరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో జరిగే పవన్ కళ్యాణ్ యాత్రకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున జనసైనికులు అందరూ పాల్గొంటారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేతకాని దద్దమ్మ పనులు మానుకోవాలి.