విశాఖపట్నం, (జనస్వరం) : అచ్చుతాపురం బ్రాండిక్స్ లో సీడ్స్ కంపెనిలో జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటనపై దర్యాప్తు నివేదికను బహిర్గతం చెయ్యాలని PAC సభ్యులు గాజువాక ఇంచార్జి కోన తాతారావు ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి యలమంచిలి ఇంచార్జి సుందరపు విజయకుమార్, చోడవరం ఇంచార్జి PVSN రాజు, విశాఖ ఉత్తర ఇంచార్జి పసుపులేటి ఉషా కిరణ్ లతో కలసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికార్లను కలవడం జరిగింది. ఈ సందర్భంగా సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ ఘటన పై కలెక్టర్ ని కలవండి మేము ఏమి చేయలేము అని చేతులు ఎత్తేశారు అని అన్నారు. ప్రజల ప్రాణాలు అంటే అసలు ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు అని ఆయన ఆరోపించారు. ఆ కంపెనిలో పనిచేస్తున్న ఉద్యోగులకే కాకుండా పరిసరా గ్రామల ప్రజలకు కూడా ఆ విష వాయువు ఎక్కడ నుండి వచ్చింది అసలు అది ఏ వాయువు అని తెలియక నేటికి చాలా భయపడుతున్నారు అన్నారు. ఆనాడు జరిగిన ఘటన లో బాధితులైన ఉద్యోగులకు ఏవిధమైన భరోసా ఇవ్వకుండా కంపెనీతో ప్రభుత్వం కుమ్మకైంది అన్నారు. ఏ ప్రాంతంలోనైనా కంపెనీలు, ఉపాధి అవసరమే కానీ ఆయా కంపెనీలు ఉద్యోగుల ప్రాణాలకు సరైన రక్షణ చర్యలు, కనీస వేతనాలను అమలు పర్చేలాగ చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు.ఈ ఘటనకు భాద్యులయిన వారిపై చర్యలు తీసుకొనే వరకు జనసేన పార్టీ పోరాడుతుందని చెప్పారు.