ప్రకాశం, (జనస్వరం) : ఈ నెల 19న ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో జరగబోయే పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రను విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ జనసేన నాయకులకు, కార్యకర్తలకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ పాదయాత్రలో కౌలు రైతులను అన్నీ విధములుగా అందుకుంటాము అని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే కౌలు రైతులను విస్మరించడం జరిగింది అని అన్నారు. వారికీ భరోసాగా రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు జనసేన పార్టీ తరుపున ఆర్థిక సాయం చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దానిలో భాగంగా ఈ నెల 19న ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పర్యటిస్తారని, పర్చూరు SKPR డిగ్రీ కాలేజీలో వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చెక్ లను అందజేస్తారు అని, రానున్న ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని అన్నారు. అలానే అధికారంలో రాగానే కౌలు రైతు కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని తెలియజేశారు. మార్టూరు రాజుపాలెం జంక్షన్ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలకటానికి ఏర్పాట్లు పూర్తి చేసాము అని అన్నారు. అలానే అధినేత పవన్ కళ్యాణ్ యాత్రను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్ తదితరులు పాల్గొన్నారు.