Search
Close this search box.
Search
Close this search box.

టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులు బాధితులుగా మారారు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి
  • పేదలకు ఇళ్ళు, ఇళ్ళ స్థలాల విషయంలో ప్రభుత్వ తీరుపై పవనన్న ప్రజాబాటలో మండిపడ్డ జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి
  • నెల్లూరు సిటీలో ఈ మూడేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు అయినా నిర్మించి గృహప్రవేశం చేయించిందా అని, పూర్తి చేసుంటే ఇదిగో చేసాము అని చెప్పుకునే దమ్ము నెల్లూరు సిటీలో ఏ ఒక్క వైసీపీ నాయకుడికైనా ఉందా అని ఎద్దేవా చేసిన కేతంరెడ్డి

            నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 23వ రోజు 4వ డివిజన్ మైపాడు రోడ్డు సెంటర్, మారుతీ నగర్ 1వ వీధి ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజల సమస్యలను విని పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ళు, ఇళ్ళ స్థలాల విషయంలో మూడేళ్ళుగా మోసం చేస్తూ వస్తోందని ఆరోపించారు. నెల్లూరు సిటీ పరిధిలో పేదలకు ఇచ్చామని చెప్తున్న 6 అంకణాల స్థలాల్లో ఒక్కటంటే ఒక్కటైనా గృహాన్ని పూర్తిచేశారా, పూర్తి చేసుంటే ఇదిగో చేసాము అని చెప్పుకునే దమ్ము నెల్లూరు సిటీలో ఏ ఒక్క వైసీపీ నాయకుడికైనా ఉందా అని దుయ్యబట్టారు. ఉగాది పోతే క్రిస్మస్, క్రిస్మస్ పోతే రంజాన్, రంజాన్ పోతే సంక్రాంతి, ఇలా తేదీలు మార్చుకుంటూ పత్రికల్లో ప్రభుత్వం నిలువెత్తు ప్రకటనలు ఇచ్చుకోవడం తప్పించి పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని ఎద్దేవా చేసారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణమైన టిడ్కో ఇళ్ళ విషయంలో అయితే ఈ ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని అన్నారు. 500 రూపాయలు కట్టి సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ళ లబ్ధిదారులకు బ్యాంక్ లోన్ కట్టాల్సిన అవసరం లేదని తాము పూర్తి ఉచితంగా ఇస్తున్నాం అని ప్రకటించుకుని ఇప్పటికి కూడా అనేకమందికి ఆ ఇళ్ళను అప్పగించలేదని కేతంరెడ్డి మండిపడ్డారు. ఇక ఐదేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ టిడ్కో ఇళ్ళ కోసం 1 లక్ష రూపాయలు కట్టిన లబ్ధిదారుల బాధలు వర్ణనాతీతం అని అన్నారు. ఐదేళ్ళ క్రితం 3 రూపాయలు, 4 రూపాయల వడ్డీకి తెచ్చి లక్ష కట్టిన లబ్ధిదారులు నెలకు 3 వేల నుండి 4 వేలు వడ్డీ కడుతున్నారని, దీనికి తోడు ప్రభుత్వం ఇళ్ళు ఇవ్వకుండానే బ్యాంక్ లో లోన్ నడుస్తోందని, ఒక్కో లబ్ధిదారుడు నెలకు 3600 రూపాయల లోన్ కడుతున్నారని, కట్టక పొతే బ్యాంక్ అధికారుల వేధింపులు మొదలయ్యాయని అన్నారు. లోన్ కట్టని వారి సిబిల్ స్కోర్ కూడా దెబ్బతిని వారికి మరే ఇతర లోన్లు కూడా రావట్లేదని ప్రజలు ఆవేదన చెందారని కేతంరెడ్డి వివరించారు. ఒక ప్రక్క ప్రభుత్వం టిడ్కో ఇల్లు ఇవ్వక అద్దె ఇళ్ళల్లో 5వేలు నుండి 6వేల రూపాయలు అద్దెలు, ఇంకో ప్రక్క అప్పు తెచ్చిన కట్టిన 1 లక్ష రూపాయలకు నెలకు 3 వేల నుండి 4 వేల రూపాయల వడ్డీ, మరో ప్రక్క బ్యాంకు లోన్ 3600 రూపాయలు, ఇలా ఒక్కో లబ్ధిదారుడు నెలకు 10 వేల నుండి 12 వేల రూపాయల వరకు భారాన్ని మోస్తున్నారని, టిడ్కో గృహాల లబ్ధిదారుల్ని ఈ వైసీపీ ప్రభుత్వం బాధితులుగా మార్చేసిందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి దుయ్యబట్టారు. రానున్నది తమ జనసేన పార్టీ ప్రభుత్వమే అని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారని, ఆ రోజున నెల్లూరు సిటీలో ఏ ఒక్క లబ్ధిదారునికి కూడా నష్టం లేకుండా చక్కటి గృహాలు కట్టిస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలకు హామీ ఇస్తూ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way