పాఠశాల విద్యార్థినిపై నిందితుడు పలుమార్లు అత్యాచారం చేసిన ఘటనపై నిరసన వ్యక్తం

అత్యాచారం

          కాకినాడ ( జనస్వరం ) : కాకినాడ సిటీలో ఇటీవల ఒక అభం శుభం తెలియని పాఠశాల విద్యార్థినిపై నిందితుడు పలుమార్లు అత్యాచారం జరిపి గర్భవతిని చేయడంపై, కాకినాడ సిటీ జనసేనపార్టీ  తీవ్రంగా నిరసనను తెలియచేస్తోంది. అసలు ఇటీవల బాలికలపై, మహిళలపై రాష్ట్రంలో జరుగుతున్న హత్యాచారాలు అంతేలేకుండా పోతున్నాయి. నేరగాళ్ళకు ప్రభుత్వమన్నా, పోలీసు వ్యవస్థ అన్నా కనీసం భయంలేకుండా పోతోందని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుంకర కృష్ణవేణి అన్నారు. ఈ విషయమై విచారించడానికి కాకినాడ సిటికి వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలికి మా తీవ్ర నిరసనని తెలియచేసాము. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకునేలా ఉపక్రమించమని తెలియచేస్తూ వినతిపత్రం అందచేయడం జరిగిందన్నారు. న్యాయం జరగని పక్షంలో జనసేన పార్టీ తరపున ఆందోళనలను తీవ్రం చేస్తామని స్పష్టం చేసాము. దిశ యాప్ అని ఊదరగొట్టిన అధికార వ్యవస్థ మరి దాని ప్రయోజనాలు మహిళలకు తెలియచేయడంలో విఫలమైందా లేక అది కేవలం కన్నీళ్ళు తుడిచే ప్రయత్నమా అని ప్రశ్నిస్తున్నాము. ప్రకాశం జిల్లాలో నిందితుదికి ఉరి శిక్ష వేయించాము అని చెపుతున్న మీరు తక్షణమే ఇక్కడ ఇలాంటి దారుణం వడిగట్టిన దుర్మార్గుడిని ఉరి శిక్ష వేసి శిక్షించి ప్రభుత్వం మహిళలను రక్షించుతుందని నిరూపించుకోండి.బాధితురాలికి న్యాయం జరిగేవరకు ఆసరాగా చదువుకునేలా ఏర్పాటు చేసి, అనంతరం ఉద్యోగం ఇచ్చేలా గవర్న్మెంట్ అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. అంతే కాకుండా తక్షణమే న్యాయ పరిహారం అందచేయాలని ఇందులో ఏమాత్రం ప్రభుత్వం విఫలమైనా లేక నిర్లక్షం వహించినా జనసేన పార్టీ పోరాటం చేసి బాధితురాలికి న్యాయం జరిగేవరకు విశ్రమించదని మీకు తెలియచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి వీరమహిళలు భవాని, మాలతి, మరియా, శిరీష, లీల, ఓలేటి భారతి మరియు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, మనోహర్లాల్ గుప్తా, శ్రీమన్నారాయణ, దుర్గా, ఆకుల శ్రీనివాస్, గౌతం, నాని, కోటేశ్వర్రావ్, రామారావ్, వీరబాబు, సుంకర సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way