అనకాపల్లి ( జనస్వరం ) : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పారిశ్రామిక సెజ్ లోని సీడ్స్ కంపెనీలో విషవాయువులు లీక్ అవ్వడంతో పరిశ్రమలో 500మందికి పైగా ఆ విషవాయువులు పీల్చి అస్వస్థతకు లోనైనారు. అనకాపల్లిలో చికిత్స పొందుతున్న మహిళా ఉద్యోగులను జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యలమంచిలి నియోజకవర్గ ఇంఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంపెనీల్లో కనీసం ప్రమాణాలు పాటించకుండా ఉద్యోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటోంది అన్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్ టి ఆర్ ఆసుపత్రి శ్రావణ్ కుమార్ గారితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. సెజ్ పరిధిలో వేలల్లో కార్మికులు పనిచేస్తుంటే కనీసం అక్కడ ఇ ఎస్ ఐ 100 పడకల ఆసుపత్రి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటకి అదేవిధంగా ఉద్యోగుల నుండి కోట్ల రూపాయలు ప్రతి నెల వసూలు చేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈరోజు ఉద్యోగులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు .కొసమెరపు ఏమిటంటే వాస్తవంగా ఏ కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యిందో ప్రభుత్వం చెప్పకుండా వైద్యం చేస్తున్నారు. దీని కారణంగా డాక్టర్లుకు ఎలా వైద్యం చేయాలో అర్ధం కావడం లేదు. ఈ కార్యక్రమంలో జనసేన చోడవరం ఇంఛార్జ్ పి యస్ ఎన్ రాజు, వీరమహిళ మోటూరు శ్రీవేణి, కుర్రు సరోజిని, కరెడ్ల ప్రకాష్, పప్పల రమణ అగ్గాల భాస్కర్ రావు, కంఠంరెడ్డి రవి, పెదపాటి శివాజీ కృష్ణ పాల్గొన్నారు.