● మొక్కలు నాటిన జనసేన నాయకులు
● జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యం
● పట్టణంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేదానికి కృషి
విజయనగరం, (జనస్వరం) : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్బంగా ఆదివారం స్థానిక కె.ఎల్.పురం, యాతపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు)నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా గాయకుడు అదాడ మోహనరావు విచ్చేసి మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ను నిషేదించాలని మొక్కలు సంరక్షించు కోవాలని ర్యాలీ నిర్వహించి, ఇంటిఇంటికి మొక్కలు పంచిపెట్టారు..ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్దాంతం పర్యావరణ పరిరక్షణ అని, ప్రజలు బాగుంటేనే సమాజం బాగుంటుందని, సమాజం బాగుండాలంటే ప్రజలందరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నాడు విజయనగరం పట్టణంలో పూర్తిగా ప్లాస్టిక్ ను ప్రజలు వాడకుండా అవగాహన కల్పించి, ప్లాస్టిక్ సంచులను, గ్లాసులను, దుకాణాల్లో అమ్మకుండా కృషి చేస్తామని, వీటిపై కొన్ని ప్రణాళికలు రూపోందిస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, మిడతాన రవికుమార్, చిరంజీవి యువత, జనసేన నాయకులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, కుప్ప ఆనంద్, చుక్క రవికుమార్, నాని, ముత్యాలు, మధు, ప్రసాదు, రవి, రాంబాబు, కనపాక సాయి, అప్పన్న, సాయి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.