రాజంపేట, (జనస్వరం) : అన్నమయ్య వరద బాధితుల సమస్యల పరిష్కారంలో భాగంగా RDO కొందండరామిరెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు జనసేన నాయకులు చెంగారి శివ ప్రసాద్ తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ అన్నమయ్య ప్రాజెక్ట్ క్రింద వరదల కారణంగా రాజంపేట మండలం మందపల్లి, పులపుత్తూరు, వడ్డెపల్లి, తోగురుపేట, రామచంద్రపురం, గుండ్లూరు, రాచపల్లి తదితర గ్రామాలు గతంలో నష్టపోయాయి. సదరు గ్రామ ప్రజలు ఇండ్లు కూలిపోయి, ఆస్తి నష్టం, పంట నష్టం, ప్రాణ నష్టాన్ని భరించవలసి వచ్చింది. సదరు గ్రామ పొలాల్లో 5 నుండి 7 అడుగులు ఇసుక మేటలు పేరుకుపోయి పంటలు పందించుకొనుటకు వీలు లేకుండా పోయింది.సదరు గ్రామస్థులు సరైన నష్టపోయిన పరిహారాన్ని అందుకోలేదు. వారికి ఎటువంటి నివాస గృహాలు నిర్మించలేదు. అలాగే వారికి మెరుగైన వైద్య సదుపాయలు అందించి ప్రభుత్వం ఆదుకోవాలి అని కోరడమైనది. అదే విధంగా పొలాల్లో పూడిపోయిన బోర్లను కూడా సరి చేయలేదు. మునకకి గురైన గ్రామ నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశం కల్పించవలసిందిగా కోరడమైనది. సదరు గ్రామల రహదారుల ఏర్పాటు చేయవలెను. మరి ముఖ్యంగా ఉచిత త్రాగు నీటి సౌకర్యం కల్పించవలసిందిగా కోరడమైనది జనసేన నాయకులు చెంగారి శివ ప్రసాద్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షైక్ అబ్దుల్ లతీఫ్, లీగల్ సెల్ కత్తి సుబ్బారాయుడు, అజయ్ వేల్పుల, మారన్, మస్తాన్ రాయల్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.