శ్రీశైలం, (జనస్వరం) : కర్నూలు జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, సున్నిపెంటలో జనసేనపార్టీ కార్యాలయం నందు టీం పిడికిలి Project 2 గోడ ప్రతులును జనసేన నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ CBI దత్తపుత్రుడుకి శ్రీశైలం నియోజకవర్గం, సున్నిపెంట జనసేనపార్టీ నుంచి సవాల్. ఇంతవరకు మా జనసేన పార్టీ అధినేత గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చెక్కుల పంపిణీ చేసిన వారిలో ఏ ఒక్కరైనా కౌలు రైతులు కాదని నిరూపించే దమ్ము ధైర్యం ఈ సిబిఐ దత్తపుత్రుడుకు ఉందా! అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన 3000 కౌలు రైతులుకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 3000 వేల కుటుంబాలకు 30 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్న జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని గొప్ప సంకల్పంతో టీమ్ పిడికిలి వారి సౌజన్యంతో గోడ పత్రికలు, ఆటో స్టిక్కర్లు పోస్టర్లు మాకు అందించిన టీం పిడికిలి రాజా మైలరపుకి శ్రీశైలం నియోజకవర్గం, సున్నిపెంట జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాం. సిబిఐ దత్తపుత్రుడు జగన్ రెడ్డి మన రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు ఎంతమందికి అందించారో శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన పార్టీ శ్రీశైలం నియోజకవర్గం, సున్నిపెంట నుంచి డిమాండ్ చేశారు. అలాగే ఈ సి బి ఐ దత్తపుత్రుడు కౌలు తీసుకొని అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు సహాయం చేయడు. అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు సహాయం చేస్తూ, వారి కుటుంబాలకు భరోసా ఇస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సహాయం పొందిన ప్రతి ఒక్కరూ దేవుడిగా పవన్ కళ్యాణ్ ని భావిస్తుంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ సీబీఐ దత్తపుత్రుడు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినా జగన్ రెడ్డికి ఎందుకు అర్థం కావడం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు. అలాగే రోజురోజుకు జనసేన పార్టీపై ప్రజాదరణ పెరుగుతూ ఉంది. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ప్రజల విజయాన్ని ఎవరు ఆపలేరు, అడ్డుకోలేరు, జనసేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మీరావలి, రౌతు అశోక్ కుమార్ పాల్గొని విజయవంతం చేశారు.