మంగళగిరి, (జనస్వరం) : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే కోనసీమ ఈరోజున కేవలం ప్రభుత్వ వైఫల్యం వలన రావణకాష్టంగా మారిందని అన్నారు. అలాగే కోనసీమ జిల్లాకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని జనసేన పార్టీ మొదటి నుండి కూడా స్వాగతిస్తుంది అని కేవలం అధికార పార్టీ జనసేన పార్టీ మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ,ఎస్టీ బీసీలు లేరన్నట్టు పక్క రాష్ట్రాల నుండి బీసీ లను తీసుకువచ్చి రాజ్యసభకు పంపిస్తారా అని అడిగారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ మాట్లాడుతూ అన్ని జిల్లాలకు ముందుగానే ప్రముఖుల పేర్లు పెట్టి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడానికి ఇంత సమయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది దాని వెనకాల ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగారు. అలాగే నిజంగా ప్రభుత్వానికి దళితుల మీద ప్రేమ ఉంటే రద్దు చేయబడిన 28 సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని,ఈ మూడు సంవత్సరాలలో విడుదల చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. తదనంతరం జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయాలనుకుంటుంది అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఇలాంటి కుటిల రాజకీయ క్రీడలు ఆపాలి అని కోరారు. అలాగే తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు, కాపులు, బీసీలు ఐక్యంగా ఉంటున్నారని అది చూసి ఓర్వలేని ప్రభుత్వం కులాల మధ్య ఐక్యతను చెడగొట్టాలని చూస్తుంది అని తెలిపారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కృష్ణాజిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని కోరారు.