కోనసీమ అల్లర్లపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన జనసేన నాయకులు గెడ్డం బుజ్జి

కోనసీమ

     విశాఖపట్నం ( జనస్వరం ) : అమలాపురంలో మంగళవారం జరిగిన అల్లర్లు ఘటనపై పాయకరావుపేటలో జనసేన పార్టీ కార్యాలయంలోని బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గెడ్డం బుజ్జి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమలాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు అయనపై నమ్మకంతో జనసేన పార్టీ బలం పెరగడం చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం ఈ అల్లర్లకు జనసేన పార్టీ కారణమని రాష్ట్ర హోమ్ మంత్రి చెప్పడం విడ్డురంగా ఉందని అన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడడం మానేసి మా పార్టీపై బురద చల్లడం మానుకోవాలని కులాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలని జనసేన పార్టీపై జనంలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి నిందలు వేస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోక పోతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నిరసనలు ద్వారా బుద్ది చెప్పుతామని గెడ్డం బుజ్జి అన్నారు. అనంతరం బోడపాట్టి శివదత్ మాట్లాడుతూ నిజమైన అంబేద్కరిజం అంటే sc & st కులాల అభివృద్ధి కోసం సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా విడుదల చెయ్యండి. వారి విదేశాల చదువుల కోసం కేటాయించిన నిధులు ఆపకండి.. దయచేసి కుల చిచ్చు తెచ్చి ఇంకా తొక్కయాలన్న ఆలోచన మానుకొండని  శివదత్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనయువ నాయకులు గెడ్డం చైతన్య, గెడ్డం ఆకాష్, పల్లి దుర్గారావు, జగ్గన్న దొర, రాజరమేష్, బాబురావు, బిఎస్ఎన్ పాల్గొన్నారు. 

See also  జగ్గయ్యపేట సమస్యలను నాదెండ్ల మనోహర్ గారికి వివరించిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి