బాపట్ల ( జనస్వరం ) : పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోనీ ఎమ్మెస్సార్ కళ్యాణ మండపంలో ఈ నెల 17వ తారీకు దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేస్తామని చెప్పి వీటిని వాయిదా వేయడం జరిగినదని అన్నారు. వాయిదా వేసిన సంగతి దివ్యాంగులకు సరైన టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు. మంత్రి మేరుగ నాగార్జున గారు వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పి ఉపకరణాలు పంపిణీ చేయాలని మరియు వారికి ప్రభుత్వం ఇచ్చే 3000 పెన్షన్ లో ఇలా ఉపకరణాలు ఇస్తాం అని పిలిచి ఒక్కొక్కరికి 200 రూపాయలు చార్జీలు అయ్యేలా చేశారు అది వారికి వృదా ఖర్చు అని అన్నారు. పెరిగిన ధరలతో ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్న దివ్యాన్గు లు పోరాటం చేయకముందే జాగ్రత్త వహిస్తే మంచిది. జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది.