నెల్లూరు ( జనస్వరం ) : ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీనివాస్ భరత్ మాట్లాడుతూ గ్రామాల్లో పొలాలు లేని రైతులు కౌలుకి పొలాలు తీసుకుని పంట దిగుబడి ఆశించినంత రాక కౌలు కట్టుకోలేక పెట్టుబడులు కోసం వడ్డీలకు డబ్బులు అప్పు తెచ్చుకుని పడుతున్నారు. అదే సొంత పొలాలు వుంటే వారికి సీఎం కిసాన్, రైతు భరోసా, క్రాప్ లోన్ లు, బోర్ సదుపాయాలు, వ్యవసాయ పరికరాలు, సాయిల్ టెస్ట్ చేయించి ఏ పంట వేయాలో అగ్రికల్చర్ అధికారులు ద్వారా తెలుసుకుని వేయడం ఎల్ల రైతు నష్టపోడని అన్నారు. కౌలు కట్టాల్సిన అవసరం, నీటి కోసం ఇబ్బందులు, పెట్టుబడులు కోసం ఇబ్బందులు, పంట నష్టం ప్రభుత్వంపై ఆధార పడే పరిస్థితి దాదాపు ఉండదన్నారు. పంటకి గిట్టుబాటు ధర ఉంటే ఇక రైతు నిలదొక్కుకున్నట్టేనని భూములు లేని కొన్ని వేల మంది యువరైతులకు ఎకరా చొప్పున ఇచ్చినా వారి జీవితాల్లో వెలుగు నింపిన వారవుతారన్నారు. ఉద్యోగాలు లేని ఎందరో నిరుద్యోగులకు కూడా సొంత భూమి ఉంటే వ్యవసాయము చేసుకొని బతుకుతారు. తద్వారా యువత ప్రకృతి వ్యవసాయం పై మక్కువ చూపే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా ఆలోచించగలసిందిగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని జనసేన పార్టీ తరుపున కోరుతున్నామన్నారు.